Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దొంగతనానికి వెళ్లి.. కేక్ లు కట్ చేసి పార్టీ చేసుకున్న దొంగలు.. ఎక్కడంటే!!

సహజంగా దొంగతనానికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు? డబ్బునో, బంగారాన్నో చోరీ చేస్తారు. అవి దొరకకపోతే విలువైన వస్తువులను చోరీ చేస్తారు. కానీ కొందరు దొంగలు దొంగతనానికి వెళ్లి కేక్ లు కట్ చేసి పార్టీ చేసుకున్నారు. సెలబ్రేషన్స్ చేసుకుని అక్కడ దొరికిన స్వీట్లు, బిస్కెట్లు తీసుకొని వెళ్లిపోయారు. ఇంతకీ ఆసక్తికర ఘటన ఎక్కడ జరిగిందంటే..

షాప్ లో చొరబడిన దొంగలు.. డబ్బులు దొరక్క.. కేక్స్ తో సెలబ్రేషన్స్

షాప్ లో చొరబడిన దొంగలు.. డబ్బులు దొరక్క.. కేక్స్ తో సెలబ్రేషన్స్

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో సాయిరాం స్వీట్స్ అండ్ బేకరీ షాప్ లో అర్ధరాత్రి సమయంలో దొంగతనానికి పాల్పడ్డారు కొందరు దొంగలు. క్లోజ్ చేసి ఉన్న షాపు తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడిన దొంగలు డబ్బులు కోసం వెతికారు. అయితే ఈ షాపు యజమాని షాప్ లో డబ్బులు పెట్టకపోవడంతో, ఆ తర్వాత దొంగలు ఆసక్తికరమైన చర్యకు పాల్పడ్డారు. షాప్ లో ఎటూ డబ్బులు దొరకలేదు అని భావించిన దొంగలు, ఆ షాప్ లో ఉన్న కేక్ లను చూసి సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. ఇంకేం ఫ్రీజర్ లో ఉన్న కూల్ కేక్ లు కోసి తమకు ఇష్టమైన వాటినన్నింటినీ తిన్నారు.

షాప్ లో జరిగింది చూసి షాక్ అయిన యజమాని

షాప్ లో జరిగింది చూసి షాక్ అయిన యజమాని

ఎవరికి ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ కేక్ లు కోసుకుని పండగ చేసుకున్నారు. ఇక అక్కడితో ఆగకుండా అక్కడ ఉన్న స్వీట్లు, బిస్కెట్లు చిందరవందరగా పడేసి, తమకు నచ్చిన చాక్లెట్లు, స్వీట్లను దొంగలు ఎత్తుకెళ్లారు. ఉదయం షట్టర్ తాళం తీసి షాప్ ఓపెన్ చేద్దామని వచ్చిన యజమాని షట్టర్ తాళాలు పగలగొట్టి ఉండడంతో షాక్ తిన్నాడు. అయినా డబ్బులు షాప్ లో లేవు కదా అని భావించి లోపలికి వెళ్లి చూసిన యజమాని లోపల జరిగిన హంగామా చూసి షాక్ అయ్యాడు.

20 వేల విలువైన స్వీట్లు, చాక్లెట్లు మాయం అయ్యాయని యజమాని ఫిర్యాదు

20 వేల విలువైన స్వీట్లు, చాక్లెట్లు మాయం అయ్యాయని యజమాని ఫిర్యాదు

అర్ధరాత్రి తను షాప్ లోకి చొరబడి దొంగలు సెలబ్రేషన్స్ చేసుకున్నారని గుర్తించారు. షాప్ లో అమ్మకానికి ఉన్న కేక్ లు అన్నీ కట్ చేసి సగం తిని నాశనం చేశారని గుర్తించారు. అంతేకాదు తన షాపులో 20 వేల రూపాయల విలువైన స్వీట్లు, చాక్లెట్లు చోరీకి గురైనట్లు గా గుర్తించిన యజమాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక దొంగలు తాము దొంగతనానికి, షాపు తాళం పగలగొట్టడానికి తీసుకువచ్చిన రాడ్లు అక్కడే వదిలేసి వెళ్లినట్టు పోలీసులకు చెప్పారు. కౌంటర్ లో డబ్బులు లేవని, దాంతోనే ఇలా చేసి ఉంటారని బాధితుడు అనుమానం వ్యక్తం చేశారు.

 కేక్ లు కట్ చేసుకు తింది దొంగలేనా? దర్యాప్తు చేస్తున్న పోలీసులు

కేక్ లు కట్ చేసుకు తింది దొంగలేనా? దర్యాప్తు చేస్తున్న పోలీసులు

అయితే ఈ షాప్ లో ఇంత హంగామా చేసింది దొంగలేనా? లేదా షట్టర్ తాళాలు పగలగొట్టి ఉండడంతో మరెవరైనా షాప్ లోకి చొరబడి ఈ బీభత్సం చేసి ఉంటారా అన్న క్రమంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా దొంగలే ఈ పని చేసి ఉంటారని భావిస్తున్న స్థానికులు మాత్రం, షాప్ లో దొంగలు చేసిన పనికి నవ్వుకుంటున్నారు. షాపు యజమాని పట్ల.. అయ్యో పాపం అంటూ సానుభూతిని ప్రదర్శిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+