ఐసిస్‌లో చేరేందుకు హైదరాబాద్ విద్యార్ధుల యత్నం: నాగ్‌పూర్‌లో అరెస్ట్
హైదరాబాద్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ విమానాశ్రయంలో ఏటీఎస్ అధికారులు ముగ్గురు హైదరాబాద్ యువకులను పోలీసులు అరెస్టు చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్ధ ఐసీస్‌లో చేరేందుకు వెళ్తున్నారనే అనుమానంతో తెలంగాణ, ఏటీఎస్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి ఈ ముగ్గురు విద్యార్ధులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత నాగపూర్ నుంచి ఇండిగో విమానంలో శ్రీనగర్‌కు వెళ్లేందుకు ఈ ముగ్గురు విద్యార్థులు యత్నించారు. ఐసిస్‌లో చేరేందుకు ముగ్గురు విద్యార్థులు ఆప్ఘనిస్థాన్ వెళ్లేందుకు సిద్ధమైనట్లు పోలీసులకు సమాచారం అందింది.

హైదరాబాదు నుంచి శుక్రవారం సాయంత్రం రోడ్డు మార్గం మీదుగా నాగపూర్ చేరుకున్న యువకులు అక్కడి నుంచి జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌కు వెళ్లేందుకు నాగ్‌పూర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అరెస్టైన విద్యార్థులను అబ్దుల్ వసీమ్, ఉమర్ హసన్ ఫరూఖీ, మజ్హా హసన్ ఫరూఖ్‌గా గుర్తించారు. 20 ఏళ్ల వయసుకున్న ఈ ముగ్గురు యువకుల స్వస్థలం హైదరాబాద్. తమ పిల్లల ఆచూకీ లభించడం లేదని వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications