ఆర్వీ ఇంజినీరింగ్ పరిశ్రమలో భారీ పేలుడు: నలుగురికి తీవ్ర గాయాలు; ఖమ్మం మార్కెట్లో మంటలు
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో ఉన్న పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్వీ ఇంజినీరింగ్ పరిశ్రమలో పేలుడు సంభవించడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరందర్నీ పాటన్‌చెరులో ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. స్వల్పంగా గాయపడిన మరో వ్యక్తిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పాశమైలారం పారిశ్రామికవాడలో ఆర్వీ ఇంజినీరింగ్ పరిశ్రమ ఆవరణలోనే రెండు యూనిట్లు నడుపుతున్నారు. ఒకదానిలో ఆర్వీ ఇంజినీరింగ్ పరిశ్రమ నడుపుతుండగా.. అదే ఆవరణలో ఆర్వీ పాలిమర్స్ పరిశ్రమ నిర్వహిస్తున్నారు. ఆర్వీ పాలిమర్స్‌కు చెందిన రియాక్టర్ ఇంజినీరింగ్ విభాగంలో ఉంది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆకస్మత్తుగా పేలింది.

దీంతో ప్లాంట్ ఇంఛార్జీగా ఉన్న రమణారెడ్డి, అక్కడ పనిచేస్తున్న కార్మికుడు సతీష్‌కు తీవ్రంగా గాయపడ్డారు. వీరితోపాటు రమణారెడ్డిని కలిసేందుకు వచ్చిన వెంకటేశ్వర్ రావు అనే వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ముగ్గురికి తీవ్రంగా గాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించడంతో పరిశ్రమలో పనిచేస్తున్న మిగితా కార్మికులు భయాందోళనలకు గురయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ఇది ఇలావుండగా, మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో షార్ట్ సర్క్యూట్‌తో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక మహాదేవ్ ఇండస్ట్రీలో ఉదయం పొగలు రావడం గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వచ్చి మంటలు ఆర్పివేశారు. అయితే, అప్పటికే ధాన్యం, బియ్యం, గన్ని బస్తాలు దగ్ధమయ్యాయి. సుమారు రూ. 3 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని యజమాని తెలిపాడు.
ఖమ్మం పత్తి మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం
ఖమ్మం పత్తి మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 1600 బస్తాల పత్తి అగ్నికి అహుతైంది. దీంతో రూ. 1.25 కోట్ల మేర భారీ ఆస్తి నష్టం జరిగింది. అగ్ని ప్రమాదంతో భయాందోళనలకు గురైన రైతులు, సిబ్బంది అక్కడ్నుంచి పరుగులు తీశారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. హుటాహుటిన చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications