నిప్పుల్లో కాలుతున్న గడ్డపార పట్టుకోవాలని.. యువకుడికి శీల పరీక్ష!!

నిప్పుల్లో కాలుతున్న గడ్డపార పట్టుకోవాలని యువకుడికి శీల పరీక్ష చేశారు ములుగుకు చెందిన కొందరు కులపెద్దలు.

శాస్త్ర, సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందిన నేటి రోజుల్లో కూడా ఇంకా ఆటవికత రాజ్యం ఏలుతూనే ఉంది. నిత్యం ఎక్కడో చోట సభ్య సమాజం సిగ్గుపడేలా అమానుష ఘటనలు చోటు చేసుకోవడం కనిపిస్తుంది. బాగా చదువుకొని ఎన్నో విజయాలు సాధించామని చెప్పుకుంటున్న మనం ఎటు పోతున్నాం అన్నది కొన్ని ఘటనలు చూస్తే అందరినీ ఆలోచించేలా చేస్తుంది.

ములుగు జిల్లాలో అమానుష ఘటన.. యువకుడికి శీల పరీక్ష

ములుగు జిల్లాలో అమానుష ఘటన.. యువకుడికి శీల పరీక్ష

ములుగు జిల్లా ములుగు మండలంలోని బంజారా పల్లి గ్రామంలో ఓ అమానుషఘటన చోటుచేసుకుంది. బంజారా పల్లి గ్రామంలో ఒక కులానికి సంబంధించిన జగన్నాథం గంగాధర్ అనే వ్యక్తికి శీల పరీక్ష నిర్వహించారు. అతనిపై వివాహేతర సంబంధం ఆరోపణలు రావడంతో కుల పెద్దలు తన నిజాయితీని నిరూపించుకోవడానికి అగ్ని పరీక్ష పెట్టారు.

వివాహేతర సంబంధం ఆరోపణలు.. నిప్పుల్లో నుండి గడ్డపార తియ్యాలని హుకుం

వివాహేతర సంబంధం ఆరోపణలు.. నిప్పుల్లో నుండి గడ్డపార తియ్యాలని హుకుం

పక్కనే ఉన్న చెరువులో స్నానం చేసి నిష్టగా అగ్నిపరీక్షతో తన తన శీలాన్ని నిరూపించుకోవాలని సూచించారు. తనకు ఎవరితో వివాహేతర సంబంధం లేదని అగ్ని పరీక్షలో పాల్గొనాలన్నారు. కాలే కాలే నిప్పుల్లో గడ్డపారవేసి, అది ఎర్రగా కాలిన తర్వాత ఆ గడ్డపారను చేతులతో తీయాలని హుకుం జారీ చేశారు. నిప్పుల చుట్టూ ప్రదక్షణ చేయించి గడ్డపారను చేతులతో తీయించిన కుల పెద్దలు అక్కడితో ఆగకుండా ఆపై అతనికి పంచాయితీ చేసిన పెద్దలకు డబ్బులు చెల్లించాలని హుకుం జారీ చేశారు.

11లక్షల డబ్బు డిపాజిట్ చేయాలని ఆదేశం

11లక్షల డబ్బు డిపాజిట్ చేయాలని ఆదేశం

ఇక ఈ వ్యవహారంలో సదరు కుల పెద్దలు పంచాయితీకి 11లక్షల నగదును డిపాజిట్ గా ఇవ్వాలని ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఒకవేళ వివాహేతర సంబంధం ఉంటే , ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి పోలీస్ స్టేషన్లు, కోర్టులు, చట్టాలు ఉన్నాయని, కానీ వాటినన్నింటినీ పక్కనపెట్టి అగ్నిపరీక్షలు, శీల పరీక్షలు ఏమిటి అన్న చర్చ స్థానికంగా కొనసాగుతుంది.

పోలీసులు స్పందిస్తారా?

మరి ఈ ఘటనతో సదరు పంచాయతీ చేసిన కుల పెద్దలు చేసిన ఆటవిక పని వెలుగులోకి రావడంతో ఇప్పటికైనా పోలీసులు స్పందిస్తారా? ఇలాంటి మూఢ నమ్మకాలను దూరం చేయటానికి ఏమైనా చొరవ చూపిస్తారా? అంతా చూస్తూ యువకుడితో కాలుతున్న గడ్డపార తీయించిన క్రమంలో వారిపై కేసు నమోదు చేస్తారా? ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటారా? అన్నది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+