విందులు, వినోదాలకు దూరంగా, నాన్న చనిపోయిన బాధలోనే: తనీష్
టాలీవుడ్ సినీ నటుడు తనీష్‌ను సిట్ అధికారులు నాలుగు గంటలపాటు విచారించారు. డ్రగ్స్ కేసులో సంబంధాలపై సిట్ అధికారులు తనీష్‌ను విచారించారు. సిట్ విచారణకు తనీష్ పూర్తిగా సహకరించినట్టు సమాచారం.
హైదరాబాద్: టాలీవుడ్ సినీ నటుడు తనీష్‌ను సిట్ అధికారులు నాలుగు గంటలపాటు విచారించారు. డ్రగ్స్ కేసులో సంబంధాలపై సిట్ అధికారులు తనీష్‌ను విచారించారు. సిట్ విచారణకు తనీష్ పూర్తిగా సహకరించినట్టు సమాచారం.తండ్రి చనిపోయిన విషాదం నుండి ఇంకా దూరం కాలేదన్నారు. విందులు ,వినోదాలకు దూరమయ్యాను. ఏదైనా రాసే ముందు నిర్ధారణ చేసుకోవాలని ఆయన సూచించారు.
డ్రగ్స్ కేసుకు సంబంధించి తొలి విడత విచారణ సాగుతోంది. ఈ విచారణ తుది దశకు చేరుకొంది. ఈ విచారణకు సంబంధించి ఇప్పటికే కీలకమైన సమాచారాన్ని సేకరించినట్టు సమాచారం అందుతోంది.
నోటీసులు అందుకొన్న సినీ ప్రముఖులను రోజుకు ఒక్కరి చొప్పున విచారణ చేస్తున్నారు. ఈ విచారణ సందర్భంగా సేకరించిన సమాచారాన్ని బట్టి ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
అయితే డ్రగ్స్ కేసులో విచారణకు హజరైన సినీ ప్రముఖుల్లో అతి తక్కువ సమయంలోనే విచారణ పూర్తిచేసుకొని ఎక్సైజ్ కార్యాలయం నుండి తిరిగి వెళ్ళిన హీరో తనీష్ కావడం గమనార్హం.

నాలుగు గంటలపాటు తనీష్ విచారణ
టాలీవుడ్ హీరో తనిష్ విచారణ నాలుగు గంటలపాటు సాగింది. విచారణ సమయంలో సిట్ అధికారులకు సహకరిస్తానని ప్రకటించినట్టుగానే ఆయన ఈ వ్యవహరించారని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. కెల్విన్, జీషాన్‌తో ఉన్న సంబంధాలు, ఎంత కాలంగా వారితో పరిచయాలున్నాయనే విషయాలపై ఆరా తీశారని సమాచారం.జీషాన్ ఫోన్‌లో ఫోన్ నెంబర్ ఎందుకు ఉందని కూడ ప్రశ్నించారని తెలుస్తోంది.

డ్రగ్స్ తీసుకొనేవారా?
డ్రగ్స్ తీసుకొనే అలవాటు ఉందా అంటూ తనీష్‌ను సిట్ అధికారులు ప్రశ్నించారు.జీషాన్ డ్రగ్స్ ఇచ్చేవాడా, పబ్‌లు, పార్టీలకు విరివిగా వెళ్తుంటారా? టాలీవుడ్‌లో డ్రగ్స్ తీసుకొనే వారు ఎవరెవరనే విషయాలపై ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో ఉన్న సంబంధాలపై కూడ ఆరా తీశారని సమాచారం. డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో ఉన్న సంబంధాలపై కూడ ఆరా తీశారు. జీషాన్ పూరీకి డ్రగ్స్ చేరవేసేవాడా అనే ప్రశ్నలను కూడ వేశారని సమాచారం.

విందులు, వినోదాలకు దూరం
గత కొన్నేళ్ళుగా టాలీవుడ్‌లో తాను ఉన్నానని చెప్పారు. ఇంకా ఈ విషాదం నుండి బయటపడలేదని తనీష్ చెప్పుకొచ్చారు. ఇన్నేళ్ళలో తాను ఏనాడూ కూడ వివాదంలో ఇరుక్కోలేదన్నారు తనీష్. ఆ విషాదం నుండి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. తండ్రి మరణంతో కొడుకుగా ఇంటి బాధ్యతలన్నీ తనపై పడ్డాయన్నారు. విందులు, వినోదాలకు దూరమయ్యాయని చెప్పారు.

నిర్దారణ చేసుకోవాలి
మీడియాలో కథనాలు ప్రసారం చేసే ముందు ఒకసారి నిర్ధారణ చేసుకోవాలని కూడ తనీష్ మీడియాను కోరారు. నిరాధారణ కథనాలతో తమ కుటుంబసభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. విచారణలో భాగంగా అవసరమైతే తమను వివరణ అడగాలనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications