ట్విస్ట్: మమత ఫోన్, ప్రమాదానికి గంట ముందు ఎస్ఐ ఖలీల్ హంగామా

హైదరాబాద్: ట్రైనీ కానిస్టేబుల్ మమత ఫోన్ చేయడంతోనే వికారాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ ఖలీల్ అప్పా జంక్షన్‌కు వచ్చాడని పోలీసులు నిర్ధారించారు. ప్రమాదానికి గంట ముందుగా ఎస్ఐ ఖలీల్ హిమాయత్‌సాగర్ ఆరే మైసమ్మగుడి వద్ద యువకులతో గొడవకు దిగాడు.

ఈ నెల 12వ, తేది రాత్రి పూట హిమాయత్‌సాగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వికారాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ ఖలీల్, ట్రైనీ కానిస్టేబుల్ కీర్తి మరణించారు. మరో ట్రైనీ కానిస్టేబుల్ మమత ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Trainee constable Mamata phoned to Si Khaleel

అయితే శనివారం నాడు ఇంటికి వస్తానని భార్య ముంతాజ్‌కు ఉదయాన్నే ఫోన్ చేసి ఖలీల్ చెప్పాడు. అయితే సాయంత్రం పూట రోడ్డుప్రమాదంలో ఖలీల్ మరణించాడు. ట్రైనీ కానిస్టేబుల్ మమత ఎస్ఐ ఖలీల్‌కు ఫోన్ చేయడంతోనే ఎస్ఐ ఖలీల్ అప్పా జంక్షన్‌కు వచ్చాడని పోలీసులు గుర్తించారు.

మమత ఫోన్ చేసి పిలవడంతోనే అంబర్‌పేట, ఉప్పల్‌లో ట్రైనీ కానిస్టేబుళ్ళను దింపేందుకుగాను ఎస్ఐ ఖలీల్ అక్కడికి వచ్చారని రాజేంద్రనగర్ పోలీసులు గుర్తించారు.

హిమాయత్‌సాగర్ సమీపంలోని ఆరేమైసమ్మ గుడి వద్ద ఇద్దరు యువకులు కారుకు అడ్డుగా వచ్చారని ఎస్ఐ ఖలీల్ గొడవకు దిగారని కూడ పోలీసులు గుర్తించారు.నానా హంగామా చేశారని కూడ పోలీసులు నిర్ధారించారు.ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే రోడ్డు ప్రమాదంలో ఖలీల్ మరణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+