సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా, బిగ్ అప్డేట్..!!
సంక్రాంతి వేళ రైల్వే నిర్ణయం ఏంటి. ఇప్పటికే సంక్రాంతికి సొంత ఊర్లకు వెళ్లే వారి తో ప్రధాన మార్గాల్లోని అన్ని ముఖ్యమైన రైళ్లల్లో భారీ వెయిటింగ్ లిస్టు కనిపిస్తోంది. పండుగను తమ సొంతూళ్లలో జరుపుకోవడానికి నగరవాసులు రెండు నెలల ముందుగానే టికెట్లను రిజర్వేషన్ చేయించుకోవడమే దీనికి కారణంగా అధికారులు చెబుతున్నారు. దీంతో 2026 జనవరి 13, 14, 15 తేదీల్లో మూడు రోజుల పాటు జరుపుకొనే సంక్రాంతి పండుగకు అసలు టికెట్లే దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో, రైల్వే శాఖ ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది.
సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనపు రైళ్లను నడపాలని ప్రయాణీకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, దీని పైన దక్షిణ మధ్య రైల్వే కసరత్తు చేస్తోంది. ఇప్పటికే వెయిటింగ్ లిస్టు ఎక్కువగా ఉన్న ముఖ్యమైన రైళ్ల వివరాల ఆధారంగా స్పెషల్ రైళ్ల రూట్లను ఖరారు చేయనుందని సమాచారం. 50కి పైగా ప్రత్యేక రైళ్లను ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఆయా అదనపు రైళ్లను హైదరాబాద్ లోని వివిధ ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు నడిపేందుకు సిద్దమవుతోందని తెలుస్తోంది. సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనపు రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే భావిస్తోంది. ఇప్పటికే శబరిమలతో సహా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతుండటంతో.. వచ్చే వారం సంక్రాంతి రైళ్లను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
కాగా, రెగ్యులర్ రైళ్లతో పాటుగా ఆర్టీసీ బస్సుల్లోనూ రిజర్వేషన్లు ఫుల్ అయ్యాయి. దీంతో.. విమానాల వైపు ప్రయాణీకులు చూస్తున్నారు. ఏపీలోని పలు ప్రాంతాలతో పాటుగా కర్ణాటక, తమిళనాడు వైపు రైళ్లల్లోనూ రిజర్వేషన్లు ఖాళీ లేవు. చెన్నై చెంగల్పట్టు, చిత్తూరు వెంకటాద్రి, పుదుచ్చేరి, బెంగళూ ర్-అశోకపురం, యశ్వంత్‌పూర్ తదితర రైళ్లలో పండుగకు ముందుగానే టికెట్ల రిజర్వేషన్ పూర్తిగా అయిపోయింది. సంక్రాంతి పండుగ ప్రత్యేకంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఘనంగా నిర్వహిస్తారు.
వివిధ ప్రాంతాలలో కోడి పందేలు ఆసక్తికరంగా ఉంటాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో టాటానగర్, కాకినాడకు వెళ్లే రైళ్లను పునరుద్ధరించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ప్రతీ ఏటా ఉండే రద్దీ.. స్పెషల్ ట్రైన్స్ కు వచ్చిన స్పందన తో పాటుగా ప్రస్తుతం ఏ మార్గంలో ఎక్కువగా అవసరం ఉంటుందనేది అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రైల్వే అధికారుల నిర్ణయం కోసం పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు వేచి చూస్తున్నారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications