4జి సేవల కోసం మేడ్చల్‌లో ట్రీ టవర్, త్వరలో హైదరాబాదులో...
హైదరాబాద్: కొత్తగా సెల్ టవర్లుగా ట్రీ టవర్లు వస్తున్నాయి. త్వరలో ఇవి విస్తరించనున్నాయి. సెల్ ఫోన్ టవరే చెట్టులాగా ఉంటుంది. దీని వల్ల రేడియేషన్ కూడా తక్కువ అని చెబుతున్నారు. ఓ ట్రీ టవర్‌ను మేడ్చల్ సమీపంలోని గూడవల్లిలో ఏర్పాటు చేశారు.
ఇది కొబ్బరి చెట్టులా ఉంటుంది. ఈ ఆర్టిఫీషియల్ కొబ్బరి చెట్టు 4జీ మొబైల్ సిగ్నల్స్ కోసం ఏర్పాటు చేశారు. దీనిని ఓ ప్రైవేటు సెల్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ ఏర్పాటు చేసింది. ట్రయల్స్ పూర్తయిన తర్వాత ఇలాంటి ఆర్టిఫిషియల్ ట్రీ టవర్లు హైదరాబాదులోనూ కనువిందు చేస్తాయి.

25 మీటర్ల పొడవు, తక్కువ విస్తీర్ణం ఉన్న స్టీల్ పైప్‌తో ఈ టవర్‌లను నిర్మిస్తారు. సంప్రదాయ టవర్ల నిర్మాణానికి ఎక్కువ స్థలం కావాలి. ఈ టవర్ల నిర్మాణంతో కంపెనీలకు స్థలాభావ సమస్య, అద్దె భారం తగ్గుతుంది.
వీటిని కామోఫ్లాగ్డ్ టవర్స్ అంటారు.
ఇదిలా ఉండగా, మెట్రో రైల్‌ను వినియోగించుకోబోయే ప్రయాణికుల కోసం కూడా ఫోర్ జీ సేవల్ని ఉపయోగించుకునేందుకు ఎంట్రీ, ఎగ్జిట్‌కు సమీపంలో ప్రతీ స్టేషన్‌కు నాలుగు ట్రీ టవర్లను ఏర్పాటు చేయనున్నారు.












Click it and Unblock the Notifications