రాళ్లు, కత్తులతో దాడి చేసి టీఆర్ఎస్ నేత హత్య, పరస్పరం దాడులు, ఉద్రిక్తత
రంగారెడ్డి: వికారాబాద్ జిల్లా సుల్తాన్‌పూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీఆర్ఎస్ నేత లీడర్ ఫిరంగి నారాయణను ప్రత్యర్థులు హత్య చేశారు. దీంతో ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ప్రత్యర్థులు నారాయణపై రాళ్లతో దాడి చేశారు. అనంతరం కత్తులతో దాడి చేసి చంపేశారు. దీంతో ప్రత్యర్థి వర్గంపై టీఆర్ఎస్ వర్గం దాడి చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి.
రాజకీయంగా ఎదుర్కోలేక తన తండ్రిని హత్య చేశారని హతుడు నారాయణ రెడ్డి తనయుడు మధూసూదన్ రెడ్డి అన్నారు. వారం రోజులుగా సుల్తాన్‌పూర్‌లో రెక్కీ నిర్వహించారని ఆరోపించారు. ఆరుగురు దాడి చేసి తన తండ్రిని హత్య చేశారన్నారు. సోమవారం కూడా తన తండ్రిపై హత్యాయత్నం జరిగిందన్నారు. తౌరియా నాయక్, కురువ వెంకటయ్య, కురువ శ్రీను, కురువ బీరయ్య, గొల్ల ఆంజనేయులు కలిసి చంపేశారని ఆరోపించారు.













Click it and Unblock the Notifications