పాపాలు పోవాలంటే పుష్కర స్నానం చేయాలి: రాహుల్‌పై కవిత వ్యాఖ్య
ఖమ్మం: ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీ రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.
పదేళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన రైతుల ఆత్మహత్యల పాపాలు పోవాలంటే రాహుల్ పుష్కర స్నానం చేయాలని సూచించారు. స్వరాష్ట్రంలో గోదావరి పుష్కరాలు కుంభమేళా తరహాలో నిర్వహిస్తున్నామని తెలిపారు. రేపటితో పుష్కరాలు ముగియనున్న నేపథ్యంలో పుష్కరఘాట్లకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందన్నారు.

కెసిఅర్‌వి దుందుడుకు చర్యలు
కరీంనగర్ జిల్లా హుజరాబాద్‌లో విద్యార్తిని ప్రాణం తీసిని ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి కొండ రాఘవరెడ్డి శుక్రవారం హైదరాబాదులో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశఆారు. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి స్పందించాలని ఆయన కోరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దుందుడుకు చర్యలు ఆపి ఆచరణ సాధ్యమయ్యే హామీలు చేసే విషయంపై దృష్టి సారించాలని ఆయన అన్నారు. హైకోర్టు నుంచి నోటీసులు రాకముందే పార్టీ ఫిరాయించిన శాసనసభ్యుల చేత రాజీనామాలు చేయించాలి ఆయన అన్నారు. లేకుంటే బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications