ఇంటర్ ఫలితాలు: మేడ్చల్ టాప్, ప్రయివేటులో ఉత్తీర్ణత తగ్గింది!
తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియేట్ ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదివారం ఉదయం విడుదల చేశారు. మొదటి సంవత్సరం ఉత్తీర్ణత శాతం 57గా ఉండగా, రెండో సంవత్సరం 66.45 శాతం ఉత్తీర్ణత ఉంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియేట్ ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదివారం ఉదయం విడుదల చేశారు. మొదటి సంవత్సరం ఉత్తీర్ణత శాతం 57గా ఉండగా, రెండో సంవత్సరం 66.45 శాతం ఉత్తీర్ణత ఉంది.
ఈ ఏడాది ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరిగింది. ప్రయివేటు కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం తగ్గింది. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరాలు కలిపి మొత్తం పది లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. ఈసారి కూడా అమ్మాయిలే టాప్.

ఇంటర్ మొదటి సంవత్సరంలో మేడ్చల్ మొదటి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. మహబూబ్ నగర్ చివరిస్థానంలో నిలిచింది.
ఇంటర్ రెండో సంవత్సరంలో మేడ్చల్ రెండో స్థానంలో, రంగారెడ్డి రెండో స్థానంలో నిలిచాయి. నిర్మల్, గద్వాల్‌లు చివరిస్థానంలో నిలిచాయి. మే 15వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి.












Click it and Unblock the Notifications