ఆగం కావొద్దు.. ఆలోచించి ఓటేయండి: మహిళా మంత్రిపై కేసీఆర్ ప్రశంసలు

హైదరాబాద్: ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని.. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ ఐదేళ్లు ఆగమవుతుందని సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హెచ్చరించారు. మహేశ్వరంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్.. కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతుబంధు దుబారా అంటున్నారని మండిపడ్డారు.

బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రైతుబంధు ఎకరానికి రూ. 16 వేలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. రైతులకు 24 గంటల విద్యుత్ వృథా అంటున్నారని.. మూడు గంటలు కరెంట్ సరఫరా చేస్తే సరిపోతుందని రేవంత్ అన్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ చెబుతోందని.. ధరణి స్థానంలో భూమాత తెస్తామంటున్నారు. కాంగ్రెస్ తెచ్చేది భూమాత కాదు.. భూమేత అని కేసీఆర్ ఎద్దేవా చేశారు.

TS Polls: KCR election campaign in maheshwaram constituency

ధరణిని తొలగిస్తే మళ్లీ అరాచకమేనని.. ఓటు జాగ్రత్తగా వేయకుంటే పదేళ్లు చేసిన కృషి బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని కేసీఆర్ హెచ్చరించారు. మహేశ్వరంలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డికి మంత్రి అనే గ‌ర్వం లేదన్నారు కేసీఆర్. ఆమె త‌న నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కోసం ఎంతో క‌ష్ట‌ప‌డి ప‌ని చేశార‌ని, ఇలాంటి ఎమ్మెల్యేను ఇక్క‌డ ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌లేదు అని కేసీఆర్ ప్ర‌శంసించారు.

ఉద‌యం వ‌ర్షం ప‌డ్డా, ఇప్పుడు ప‌డుతూనే ఉన్నా.. మీరు ఇంత మంది వచ్చారంటే స‌బిత‌ గెలుపు ఖాయ‌మైపోయిందన్నారు కేసీఆర్. రోజు మీతో క‌లిసి ఉండే వ్య‌క్తి. స‌బిత‌కు ఎంత ఓపిక ఉంట‌దో మీకు తెలుసు. భూదేవీకి ఎంత ఓపిక‌ ఉంట‌దో స‌బిత‌కు అంత ఓపిక‌ ఉంటుంది. ఆమెకు వేరు వ్యాప‌కం లేదు. సుదీర్ఘం రాజ‌కీయ అనుభ‌వం ఉంది. వారి ప‌రిధిలో ఉన్న ప‌ని వారే మంత్రిగా చేయిస్త‌రు. వారి ప‌రిధి దాటి ఉంటే ప‌ట్టుబ‌ట్టి ఆ ప‌ని త‌న ద‌గ్గ‌ర‌కు తీసుకొచ్చి చేయించే దాకా వ‌దిలిపెట్ట‌రు అని కేసీఆర్ తెలిపారు.

మహేశ్వరం బీఆర్ఎస్ అభ్యర్థి సబిత ఇంద్రారెడ్డి నిరంతరం ప్రజల కోసం తపించే నాయకురాలని తెలిపారు కేసీఆర్. మహేశ్వరంలో రూ.100 కోట్లతో నాలా సమస్యలు పరిష్కరించారని పేర్కొన్నారు. కేవలం సబిత కృషితోనే కందుకూరులో మెడికల్ కళాశాల వచ్చిందన్నారు. ఫాక్స్​ కాన్ పరిశ్రమతో లక్ష మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

అనంతరం సీఎం కేసీఆర్ వికారాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు. రైతులకు 3 గంటలే కరెంటు ఇస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని మండిపడ్డారు. వంటలు చేసి పెట్టండి.. మేము వడ్డిస్తామన్న సామెతలా కాంగ్రెస్ తీరుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇంటింటికి తాగు నీరు అందించామని కేసీఆర్ తెలిపారు. రైతులకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. తెలంగాణలో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నందునే సంపద పెరిగిందన్నారు. అధికారంలోకి రాగానే పింఛన్ పెంచుతామని హామీ ఇచ్చారు. రైతుబంధు పథకాన్ని పుట్టించిందే బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. ఇలాంటి పథకాలతో వ్యవసాయదారులు కుటుంబాలు కళకళలాడుతున్నాయన్నారు. అభివృద్ధి, సంక్షేం కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+