Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అప్లై చేయకుండానే ఓ యువతికి గ్రూప్-1 హాల్‌టికెట్: టీఎస్‌పీఎస్సీ ఏం చెప్పిందంటే?

హైదరాబాద్: ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం సంచలనం సృష్టించగా.. తాజాగా ఓ అభ్యర్థి షాకింగ్ ఆరోపణలు చేశారు. అయితే, దీనిపై టీఎస్‌పీఎస్సీ స్పష్టతనిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోకపోయినా తనకు హాల్ టికెట్ వచ్చిందంటూ ఓ విద్యార్థికి సంబంధించిన వివరాుల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణానికి చెందిన సుచిత్ర అనే యువతి.. తాను గ్రూప్-1 పరీక్షకు దరఖాస్తు చేయకుంానే హాల్ టికెట్ వచ్చిందని తెలిపారు. గ్రూప్-3, గ్రూప్-4 పరీక్షల కోసం అప్లై చేసిన తనకు.. ఆదివారం జరిగిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలని మెసేజ్ వచ్చిందని చెప్పారు.

tspsc explanation on group-1 hall ticket controversy in nizamabad district candidate

దీంతో హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేయగా.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పరీక్ష కేంద్రం వచ్చినట్లు వెల్లడించారు. దరఖాస్తు చేయకుండానే హాల్ టికెట్ రావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. తాను కేవలం గ్రూప్-3, గ్రూప్-4లకు మాత్రమే అప్లై చేశానని.. గ్రూప్-1 హాల్ టికెట్ ఎలా వచ్చిందో అర్థం కావడం లేదన్నారు.

తాజాగా, ఈ అంశంపై టీఎస్‌పీఎస్సీ వివరణ ఇచ్చింది. ఆ వార్తలను అధికారులు తీవ్రంగా ఖండించారు. అదంతా తప్పుడు ప్రచారం అని కొట్టిపారేశారు. నిజామాబాద్‌కు చెందిన అభ్యర్థి జక్కుల సుచిత్ర గత సంవత్సరం గ్రూప్-1 పరీక్షకు దరఖాస్తు చేశారని.. అక్టోబర్‌లో నిర్వహించిన పరీక్షకు ఆమె హాజరయ్యారని తెలిపారు. ఈ క్రమంలోనే గ్రూప్-3, 4 పరీక్షల కోసం దరఖాస్తు చేస్తే గ్రూప్-1 ప్రిలిమినరీ హాల్ టికెట్ ఇచ్చారన్న ప్రచారం అబద్ధమని టీఎస్‌పీఎస్సీ అధికారులు తేల్చి చెప్పారు.

ప్రశాంతంగా జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్

రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ప్రశ్నపత్రం లీకేజీ కారణంగా గత అక్టోబర్ 16న జరిగిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రద్దు కావడంతో.. నేడు అంటే ఆదివారం మళ్లీ ఆ పరీక్షను నిర్వహించారు. రాష్ట్రంలో 503 పోస్టులకు నిర్వహిస్తున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు 3,80,202 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 994 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరిగింది. పరీక్షకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

వివిధ మార్గాల నుంచి పరీక్ష కేంద్రాలకు తరలివచ్చిన అభ్యర్థుల కోసం టీఎస్ఆర్టీసీ బస్సు సౌకర్యాలు ఏర్పాటు చేసింది. అభ్యర్థులను గేటు దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించి పర్సులు, సెల్‌ఫోన్లు, చేతి గడియారాలు ఉంటే బయట పెట్టించి లోనికి అనుమతించారు. షూ వేసుకుని వచ్చినవారిని గేటు వద్దే తీయించి లోనికి పంపించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు.

ఆదివారం ఉదయం 10.30 గంటలకు మొదలైన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. ఉదయం 8.30 గంటల నుంచి 10.15 వరకు మాత్రమే అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. 10.15 గంటల తర్వాత వచ్చిన వారిని ఆలస్యమైందంటూ పరీక్ష రాయడానికి అనుమతించలేదు. దీంతో పలువురు అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు.

అరగంట ముందే పేపర్ లాక్కున్న ఇన్విజిలేటర్

రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌లోని శ్రీ చైతన్య గ్రూప్-1 పరీక్ష కేంద్రంలో గందరగోళం నెలకొంది. పరీక్ష సమయం ముగిసిందంటూ.. అరగంట ముందే ఇన్విజిలేటర్ అభ్యర్థుల నుంచి పేపర్లు తీసుకున్నాడు. అయితే, బయటకు వచ్చిన తర్వాత అభ్యర్థులకు ఇంకా అరగంట సమయం ఉందని తెలిసింది. దీంతో అభ్యర్థులు తమ పేపర్ తిరిగి ఇవ్వాలని ఇన్విజిలేటర్‌ను కోరారు. అయితే, ఆ పేపర్ తిరిగిచ్చేది లేదని ఇన్విజిలేటర్ తేల్చిచెప్పాడు.

ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలంటూ చైతన్య కాలేజీ క్యాంపస్‌లో దాదాపు 40 మంది అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే గ్రూప్-1 పేపర్ లీక్ కావడంతో నిరాశలో ఉన్న విద్యార్థులకు ఇప్పుడు ఇలాంటి సంఘటన ఎదురుకావడంతో ఆందోళన వ్యక్తం చేశారు. అరగంట ముందే పేపర్ లాక్కోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+