భూగర్భజలశాఖలో నాన్‌గెజిటెడ్ పోస్టుల పరీక్ష తేదీ ఖరారు: స్టాఫ్‌నర్స్ హాల్ టికెట్లు విడుదల
హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా వాయిదా పడిన తెలంగాణ భూగర్భ జలశాఖలో వివిధ నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ ఖరారు చేసింది. టీఎస్‌పీఎస్సీ తాజాగా చేసిన ప్రకటన ప్రకారం.. జులై 31న ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనుంది.
ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు మంగళవారం నుంచి వెబ్‌సైట్‌ల్ అందుబాటులో ఉంటాయని, డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. కాగా, జీహెచ్‌ఎంసీ పరిధిలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాల కారణంగా భూగర్భజలశాఖలో నాన్‌గెజిటెడ్ పోస్టుల రాత పరీక్షలు వాయిదా వేస్టున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలనే తాజాగా, పరీక్ష తేదీలను ప్రకించింది.

స్టాఫ్ నర్స్ పరీక్షకు హాల్ టికెట్లు విడుదల
తెలంగాణ స్టాఫ్‌నర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంబంధించిన హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డ్(ఎంహెచ్ఎస్ఆర్బీ) అధికారిక వెబ్‌సైట్ https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm లో హాల్ టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచింది.
రాష్ట్రంలో మొత్తం 5204 స్టాఫ్ నర్సుల పోస్టుల కోసం 40,926 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఆగస్టు 2న కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)ను హైదరాబాద్, వరంగల్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ కేంద్రాల్లో మూడు షిప్ట్‌లలో ఉదయం 9 గంటల నుంచి 10.20 గంటల వరకు, 12.30 నుంచి 1.50 గంటల వరకుప, సాయంత్రం 4 గంటల నుంచి 5.20 గంటల వరకు నిర్వహించనున్నారు. కాగా, ఈ పోస్టులకు తొలిసారి ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహిస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల అవగాహన కోసం వెబ్‌సైట్‌లో మాక్ టెస్ట్ కూడా నిర్వహించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications