ఫెయిలవుతానేమోనని విద్యార్థి బలవన్మరణం.. ఏ గ్రేడ్‌లో పాస్: మనస్తాపంతో మరో విద్యార్థి

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో పాసైన విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. ఫెయిలైన విద్యార్థులు నిరాశలోకి వెళుతున్నారు. పరీక్షల ఫలితాలపై తల్లిదండ్రుల ఆందోళన, కాలేజీ యాజమాన్యాల ఒత్తిడే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అలా కాకుండా పరీక్షల ఫలితాలు ఎలా ఉన్నా విద్యార్థుల్లో భరోసా నింపే విధంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పరీక్షలో ఫెయిలవడంతో మరో విద్యార్థి ఆత్మహత్య : ఇంటర్మీడియట్‌లో ఫెయిలవడంతో తీవ్ర నిరాశకు గురైన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం తెలంగాణలో ఇంటర్ పరీక్ష ఫలితాలు వెలువడగా.. ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రీనగర్ కు చెందిన ప్రజ్వల్ అనే ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి ఫెయిలయ్యాడు. దీంతో విద్యార్థి తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, ప్రజ్వల్ హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. ప్రజ్వల్ మృతితో అతని కుటుంబంలో విషాదం అలుముకుంది.

 intermediatestudent

ఫెయిలవుతానేమోనని మరో విద్యార్థి బలవన్మరణం: ఏ గ్రేడ్‌లో పాస్ :ఇంటర్ ఫలితాలు వెలువడకముందే భయంతో ఆత్మహత్యకు పాల్పడిన ఇంటర్ విద్యార్థి ఏ గ్రేడ్‌లో ఉత్తీర్ణుడయ్యాడు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేసముద్రం మండలం పిక్లా తండా శివారు బోడగుట్ట తండాకు చెందిన ఇంటర్ విద్యార్థి గుగులోతు కృష్ణ(19) మంగళవారం వెల్లడైన ఇంటర్ ఫలితాల్లో బైపీసీ విభాగంలో 892/1000 మార్కులు సాధించి ఏ గ్రేడ్‌లో ఉత్తీర్ణుడయ్యాడు. అయితే, కృష్ణ ఏప్రిల్ 10న తాను బాగా చదవలేకపోయానని, లక్ష్య సాధనలో వెనుకబడుతున్నానని లేఖ రాసి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కానీ, నేడు వెలువడిన ఫలితాల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణుడైన విషయం తెలుసుకుని.. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కొడుకా లేనిపోని అనుమానంతో ఆత్మహత్య చేసుకుంటివి.. ఇప్పుడు ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కులతో పాసతివి అంటూ తల్లిదండ్రులు రోదించారు. పరీక్షలో పాసైన కృష్ణ.. జీవితంలో ఓడిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల ఫలితాలు రాకుండానే కృష్ణ దారుణ నిర్ణయం తీసుకోవడం కుటుంబసభ్యులతోపాటు స్థానికులను కలచివేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+