పట్టించుకోవద్దు: రేవంత్‌రెడ్డితో బాబు, పార్టీ నుంచి మాగంటి, గాంధీ సస్పెండ్

హైదరాబాద్: వెళ్లిపోయిన వారి గురించి అంతగా పట్టించుకోవద్దని, తెలంగాణ అసెంబ్లీలో ప్రజా సమస్యల పైన ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు తెలంగాణ టిడిపి నేతలకు సూచించారు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచిన మాగంటి గోపినాథ్, అరికెపూడి గాంధీలు ఈ రోజు లేదా రేపు తెరాసలో చేరనున్న విషయం తెలిసిందే. టిడిపి నుంచి పదిహేను మంది గెలిస్తే ఇప్పటికే పదిమంది కారు ఎక్కారు. వీరిద్దరితో అది 12కు చేరుకుంటుంది.

మిగిలిన వారు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఆర్ కృష్ణయ్య. ఇందులో సండ్ర కూడా కారు ఎక్కుతారనే ప్రచారం సాగుతోంది. ఆర్ కృష్ణయ్య కూడా పార్టీకి దూరంగా ఉన్నాడని చెప్పవచ్చు. ఇక మిగిలింది రేవంత్ రెడ్డి ఒక్కరే. ఈ నేపథ్యంలో తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలు.. చంద్రబాబుతో భేటీ అయ్యారు.

Two More TDP MLAs to Join TRS, Suspended

బుధవారం అసెంబ్లీలో ఆయనను తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ, శాసనసభా పక్ష నేత రేవంత్ రెడ్డి, సీనియర్‌ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, అమర్‌నాథ్‌బాబు తదితరులు కలిశారు.

టిడిపి నేతలతో చంద్రబాబు మాట్లాడుతూ... పార్టీని వీడి వెళ్లిన వారి గురించి ఆలోచించవద్దని, గ్రామస్థాయి నుంచి ఉన్న కార్యకర్తలను కాపాడుకుని పార్టీ పటిష్ఠానికి కృషి చేయాలని సూచించారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

ప్రజల సమస్యలపై గట్టిగా పోరాడతామన్నారు. అనంతరం పార్టీ నేతలు తెలంగాణ శాసనసభా పక్ష కార్యాలయంలో సమావేశమై గురువారం నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

పార్టీని వీడి తెరాసలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ పట్టుబట్టాలని నిర్ణయించారు. కారు ఎక్కబోతున్న ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, అరికెపూడి గాంధీని టిడిపి నుంచి సస్పెండ్‌ చేసినట్లు తెలుగుదేశం పార్టీ బుధవారం తెలిపింది.

మమ్మల్ని టిఆర్ఎస్ సభ్యులుగా గుర్తించండి

టిడిపి హైదరాబాద్‌ మహానగర అధ్యక్షులు, జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీలు తమను టిఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలంటూ తెలంగాణ శాసనసభాపతి ఎస్ మధుసూదనాచారికి లేఖ రాశారు.

ఈ మేరకు లేఖను బుధవారం ప్రత్యేకదూత ద్వారా శాసనసభలోని సభాపతి కార్యాలయంలో అందించారు. గతకొన్ని రోజులుగా వీరిద్దరూ తెరాసలో చేరుతారంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాగంటి గోపీనాథ్‌ అయిదు రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రహస్యంగా కలిశారు.

తాను కారు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఆ తర్వాత మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, హరీశ్ రావు... గాంధీ, గోపీనాథ్‌లతో చర్చించి వారి చేరికను ఖరారు చేశారు. వాస్తవానికి ముఖ్యమంత్రి ముంబై పర్యటనకు వెళ్లివచ్చిన వెంటనే చేరేలా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే అమావాస్య కావడం, ముంబై పర్యటన అంశం మీడియాతోపాటు ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుందనే ఉద్దేశంతో గురువారానికి వాయిదా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+