కేసీఆర్‌పైనే అనుమానం, కుట్ర పూరితంగానే ఐటీ దాడులు: ఉదయసింహా
హైదరాబాద్: తనను, తన కుటుంబసభ్యుల్ని ఐటీ దాడుల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న ఉదయసింహా ఆరోపించారు. ఆదాయపుపన్ను శాఖ అధికారుల ఎదుట ఉదయసింహా, సెబాస్టియన్ సోమవారం విచారణకు హాజరయ్యారు.
గత బుధవారం కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు సెబాస్టియన్, ఉదయసింహా నివాసంలో అధికారులు సోదాలు జరిపిన విషయం తెలిసిందే. రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి ఇంట్లోనూ సోదాలు జరిపారు.

సోమవారం విచారణకు హాజరుకావాలని ఈ ముగ్గురికి సూచించడంతో బషీర్‌బాగ్‌లోని ఐటీ కార్యాలయంలో ఉదయసింహా, సెబాస్టియన్ విచారణకు హాజరయ్యారు. విచారణ పూర్తి చేసిన అధికారులు అక్టోబర్ 3న మరోసారి హాజరుకావాలని ఉదయసింహాకు సూచించారు.
ఈ సందర్భంగా ఉదయసింహా మీడియాతో మాట్లాడుతూ.. తనను, తన కుటుంబసభ్యులను ఐటీ దాడుల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. నాగోల్ జైపురి కాలనీలో తన సోదరుడి ఇంట్లో సోదాలపై ఐటీ అధికారులను అడగ్గా.. ఎలాంటి సోదాలు చేయలేదని వారు బదులిచ్చారని తెలిపారు.
ఈ నేపథ్యంలో సోదాలకు వచ్చింది నకిలీ అధికారులుగా తాను అనుమానిస్తున్నట్లు చెప్పారు. అంతేగాక, సోదాలు జరిపింది కేసీఆర్ మనుషులని తనకు అనుమానంగా ఉందని తెలిపారు. ఆదివారం కొందరు ఐటీ అధికారులమని చెప్పుకుంటూ ఉదయసింహా బంధువైన రణధీర్ ఇంట్లో సోదాలు చేసి నగలు, నగదు తీసుకెళ్లినట్లు ఆయన కుటుంబసభ్యులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications