Double digit: అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు: ఎప్పుడంటే?
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit shah) తెలంగాణ పర్యటన ఖరారైంది. డిసెంబర్ 28న రాష్ట్రానికి రానున్నారు. గురువారం మధ్యాహ్నం 12:05కి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోని అక్కడి నుంచి నేరుగా హోటల్‌కు వెళ్లనున్నారు. అనంతరం 12:20 నుంచి 1:45 వరకు బీజేపీ ముఖ్య నేతలతో సమావేశంకానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై నేతలతో చర్చించనున్నారు.
శంషాబాద్‌లో హోటల్ నుంచి 1:50కి కొంగరకలాన్ శ్లోక కన్వెన్షన్‌కు బయల్దేరి వెళ్లనున్నారు అమిత్ షా. మధ్యాహ్నం 2:10 నుంచి సాయంత్రం 4:30 వరకు జరిగే రాష్ట్ర విస్తృత సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షించడంతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తంపై పార్టీ శ్రేణులకు దిశా నిర్ధేశం చేయనున్నారు కేంద్రమంత్రి అమిత్ షా.

ఈ సమావేశం అనంతరం తిరిగి శంషాబాద్ హోటల్‌కు చేరుకుంటారు. రాష్ట్ర పర్యటనను ముగించుకుని 5:45కి శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. కాగా, అమిత్ షా పర్యటనలోనే తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ పక్ష నేతను ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, వచ్చే ఏడాది మొదటి భాగంలోనే దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరగునున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తమ నాయకులను ఇప్పటి నుంచే సిద్ధం చేస్తోంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పార్టీ ప్రముఖ నాయకులకు అగ్ర నేతలు దిశానిర్ధేశం చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో బీజేపీ గెలుపు దిశగా పయనించేందుకు నాయకులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికంగా సీట్లు రాకపోయినా, ఓట్ల శాతం పెరిగిందని బీజేపీ నేతలు కొంత సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ష్ట్రంలో ఉన్న 17 స్థానాల్లో డబుల్ డిజిట్లో సీట్లు గెలుస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇప్పటికే ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడైతే ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే పార్టీ నాయకులు లోక్‌సభ స్థానాల్లో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు జరగకుండా.. పార్టీ నేతలు సమన్వయంతో బీజేపీ అభ్యర్థుల గెలుపుకోసం పూర్తిస్థాయిలో శ్రమించాలని నిర్దేశించనున్నారు.












Click it and Unblock the Notifications