భట్టి విక్రమార్క ఫొటోను షేర్ చేసిన డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. హైదరాబాద్ రద్దీగా ఉండే రోడ్డుకు తన పేరు పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భాగ్యనగరం నడిబొడ్డున కొత్తగా ఏర్పాటు చేసిన డొనాల్డ్ ట్రంప్ అవెన్యూను అధికారికంగా ప్రారంభించిన కొద్దిరోజులకే ఆయన ఈ మేరకు స్పందించారు. ఈ తరహా గొప్ప గౌరవం భారత్ లో తనకు లభించడం ఎంతో అపూర్వమని, మరే అధ్యక్షుడికీ ఇటువంటి అవకాశం దక్కలేదని వ్యాఖ్యానించారు.

ఇటీవలే గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్‌రామ్‌గూడ పరిధిలో ఉన్న అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయానికి సమీపంలోని రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూగా పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, భారత్ లో అమెరికా రాయబారి సెర్గియో గోర్.. సంయుక్తంగా నామఫలకాన్ని ఆవిష్కరించారు. భారత్ లో ఓ అమెరికా అధ్యక్షుడి పేరు మీద రోడ్డుకు నామకరణం చేయడం ఇదే మొదటిసారి.

Unprecedented Honour Donald Trump Thanked Hyderabad Renames Road Near US Consulate Avenue

దీనిపై తాజాగా డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. ఈ రోడ్డు ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫొటోను ఆయన షేర్ చేశారు. భారత్ లో ఇలా ఓ రోడ్డుకు తన పేరు పెట్టడం ఎంతో గర్వకారణమని వ్యాఖ్యానించారు. ఆ దేశ చరిత్రలో ఈ విధమైన అసమాన గౌరవం పొందిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు తానే కావడం విశేషమని హర్షం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లో ఐటీ, ఫైనాన్షియల్ హబ్‌గా పేరొందిన గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలోని నానక్‌రామ్‌గూడ ప్రాంతంలో ఈ ప్రత్యేక అవెన్యూ ఉంది. ఇక్కడే నూతనంగా నిర్మించిన అమెరికా రాయబార కార్యాలయం కూడా కొలువై ఉంది. దానికి సరిగ్గా ఆనుకుని ఉన్న ప్రధాన రహదారికే డోనాల్డ్ ట్రంప్ అవెన్యూ గా నామకరణం చేశారు. అంతజాతీయంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింతగా పెంచేందుకు, భారత్-అమెరికా దేశాల మధ్య ఉన్న దౌత్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ప్రభుత్వం తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+