ఎన్నికల వేళ విజయశాంతి ఆసక్తికర ట్వీట్!!

బీజేపీలో ఉన్నప్పటికీ గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడిన తరుణంలో ఆసక్తికర ట్వీట్ చేశారు. గత కొంతకాలంగా విజయశాంతి పార్టీ మారతారని, పార్టీ తీరుపై అసహనంతో ఉన్నారని ప్రచారం జరుగుతున్న వేళ విజయశాంతి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

25 సంవత్సరాల రాజకీయ ప్రయాణం తనకు ఎప్పుడూ సంఘర్షణ మాత్రమే ఇచ్చిందని బిజెపి నాయకురాలు విజయశాంతి పేర్కొన్నారు. తాను ఏ రోజూ, ఏ పదవి కోరుకోలేదని తెలిపారు . తన పోరాటం తెలంగాణ బిడ్డల సంక్షేమం కోసమే తప్ప, ప్రస్తుత బీఆర్ఎస్ కు వ్యతిరేకం కాదని విజయశాంతి పేర్కొన్నారు.

Vijayashanthi interesting tweet at the time of election!!

కెసిఆర్ కుటుంబ దోపిడీపైన , కొందరు బి ఆర్ ఎస్ నేతల అరాచకం పైన పోరాటం తప్ప, తనతో కలిసి తెలంగాణ ఉద్యమంలో ప్రాణం అడ్డుపెట్టి పని చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని ఆమె స్పష్టం చేశారు. తన పోరాటం వారిపై కాదని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ఇది తెలంగాణ బిడ్డలకు చెప్పాల్సిన సత్యం అని పేర్కొన్న విజయశాంతి తెలంగాణా కోసమే తన రాజకీయ ప్రస్తానం అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

రాజకీయ పరంగా విభేదించినప్పటీకి, అన్ని పార్టీల మొత్తం తెలంగాణ బిడ్డలు సంతోషంగా, సగౌరవంగా ఎన్నటికే ఉండాలనీ మనఃపూర్వకముగా కోరుకోవటం మీ రాములమ్మ ఒకే ఒక్క ఉద్దేశ్యం. అది ఎప్పుడు అలాగే ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో విజయశాంతి ఈ మేరకు ఉద్వేగంగా ట్వీట్ చేశారు.

ప్రస్తుతం విజయశాంతి చేసిన ట్వీట్ పై ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఏ పార్టీలో పని చేస్తే ఆ పార్టీకే కట్టుబడి ఉండే విజయశాంతి ప్రస్తుతం ఒకపక్క ఎన్నికల హడావిడి కొనసాగుతున్నా ఎందుకు బీజేపీలో యాక్టివ్ గా రోల్ తీసుకోవటం లేదు అని చర్చ జరుగుతున్న సమయంలో విజయశాంతి తాజా ట్వీట్ మరోమారు చర్చకు వస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+