టైమొచ్చినప్పుడే మాట్లాడ్తా: కోర్టుకొచ్చిన విజయశాంతి
తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి వస్తానని చెప్పకనే చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి వస్తానని చెప్పకనే చెప్పారు. తాను సమయం వచ్చినప్పుడు రాజకీయాలపై మాట్లాడుతానని విజయశాంతి అన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో లక్డీకాపూల్‌లో చేపట్టిన రైల్‌రోకో ఘటనలో ఆమెపై కేసు నమోదైంది. దీని విచారణ నిమిత్తం గురువారం ఆమె కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు విచారణ జనవరి 24కు వాయిదా పడటంతో ఆమె వెనుదిరిగారు.

ఈ సందర్భంగా విజయశాంతి మీడియాతో మాట్లాడారు. రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... సమయం వచ్చినప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుతానంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications