ఎన్‌కౌంటర్‌పై ఆలేరు పీఎస్‌లో వికార్ తండ్రి ఫిర్యాదు
నల్గొండ్: ఆలేరులో జరిగిన ఎన్‌కౌంటర్
పై హతుడైన సిమి ఉగ్రవాది వికారుద్దీన్ తండ్రి ఆలేరు పోలీస్ స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. ఆలేరులో జరిగిన ఎన్‌కౌంటర్ బూటకమని ఆయన ఆరోపించారు. ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపి ఎస్కార్టుగా వచ్చిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఘటనపై పూర్తి స్థాయిలో సిబిఐచే విచారణ జరపాలని తన ఫిర్యాదు పోలీసులను కోరారు. వరంగల్ సెంట్రల్ జైలు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న క్రమంలో వరంగల్ జిల్లా జనగాం దాటిన తర్వాత నల్గొండ జిల్లా ఆలేరు సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్‌లో వికారుద్దీన్ తోపాటు అతని నలుగురు అనుచరులు హతమైన సంగతి తెలిసిందే.

కాగా, తమపై దాడికి యత్నించడంతోనే కాల్పులు జరపాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎస్కార్ట్ పోలీసులు, ఉన్నతాధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే పలు వర్గాల నుంచి ఎన్‌కౌంటర్‌పై ఆరోపణలు వస్తున్నాయి.
నల్గొండ జిల్లాలో పోలీసులను ఉగ్రవాదులు హతమార్చినందుకే ప్రతీకారంగా ఈ ఎన్‌కౌంటర్ చేశారని ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల ఎంఐఎం ఎంపి అసుద్దీన్ ఓవైసీ, పలువురు ముస్లిం పెద్దలు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును కలిసి సిబిఐ విచారణ చేపట్టాలని కోరిన విషయం తెలిసిందే.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications