నీది ఐదేళ్లే, నేను రిటైర్మెంట్ వరకు: టిడిపి నేతపైకి తుపాకీ ఎక్కుపెట్టిన కానిస్టేబుల్
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు రేవంత్ రెడ్డి, వంటేరి ప్రతాప్ రెడ్డి తదితరులకు బుధవారం నాడు చేదు అనుభవం ఎదురైంది. కరీంనగర్ జిల్లాలోని జైలు వద్ద ఓ పోలీస్ కానిస్టేబుల్ తెలుగుదేశం పార్టీ నేతల పైన విరుచుకు పడ్డారని తెలుస్తోంది. అంతేకాదు, అతను తుపాకీ ఎక్కుపెట్టినట్లుగా కూడా తెలుస్తోంది.
జైలులో జిల్లా టిడిపి అధ్యక్షులు విజయ రమణారావును కలిసేందుకు రేవంత్, వంటేరు తదితరులు వెళ్లారు. రేవంత్‌ను, వంటేరును లోపలకు అనుమతించిన పోలీసులు మిగిలిన వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో టిడిపి నేతలు, జైలు గార్డుల మధ్య వాగ్వాదం జరిగింది.

ఈ వాగ్వాదం సందర్భంగా ఓ పోలీసు నాయకుల పైకి తుపాకీ కూడా ఎక్కుపెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. పరిస్థితి గమనించిన సిబ్బంది టిడిపి నాయకులను సముదాయించి అక్కడి నుంచి పంపించారు.
సదరు పోలీస్ కానిస్టేబుల్ టిడిపి ఓ టిడిపి నేతపై తుపాకీ ఎక్కుపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించాడని తెలుస్తోంది. దీనికి ఆయన ఎదురు తిరిగాడు. దీంతో మండిపడిన సదరు కానిస్టేబుల్.. నేను ఇక్కడ డ్యూటీ చేస్తున్నానని, నువ్వు రాజకీయాల్లో అధికారంలోకి వస్తే ఐదేళ్లు ఉంటావని, నేను రిటైర్మెంట్ వరకు విధుల్లోనే ఉండాలని, ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని వారించాడని తెలుస్తోంది. దీంతో అక్కడ కాసేపు కలకలం రేగింది.
-
రైతులకు శుభవార్త.. ఆ పని చేస్తే 10వేల రూపాయల ప్రోత్సాహకం! -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
ఉచిత బస్సే జిందా తిలిస్మాత్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..?












Click it and Unblock the Notifications