KCR health: చంద్రబాబు పరామర్శ

Chandrababu Naidu: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో క్రమంగా కోలుకుంటోన్నారు. ఇంట్లో జారిపడటం వల్ల ఆయన తుంటి ఎముక చిట్లింది. దీనికి శస్త్ర చికిత్స అవసరమైంది. యశోద ఆసుపత్రి డాక్టర్లు ఆయనకు చికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటోన్నారు.

Recommended Video

    KCR Chandrababu Emotional Scene కలిసిన ఇద్దరు మిత్రులు | TDP | Telangana | Telugu Oneindia

    కేసీఆర్ ఆరోగ్యం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా పలువురు నాయకులు కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీశారు. వేగంగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు. భారత్ రాష్ట్ర సమితి నాయకులు చాలాచోట్ల ప్రత్యేక పూజలూ చేస్తోన్నారు.

    Watch: TDP Chief Chandrababu Naidu met KCR

    మరోవంక- కేసీఆర్ పరామర్శించే వారి సంఖ్య పెరుగుతోంది. పలువురు ప్రముఖులు ఆయనను పరామర్శిస్తోన్నారు. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు కొత్త మంత్రులు, బీఆర్ఎస్ శాసన సభ్యులు, త్రిదండి చినజీయర్ స్వామి, ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్.. కేసీఆర్‌ను పరామర్శించిన వారిలో ఉన్నారు.

    Watch: TDP Chief Chandrababu Naidu met KCR

    Watch: TDP Chief Chandrababu Naidu met KCR

    తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. కేసీఆర్‌ను పరామర్శించారు. కొద్దిసేపటి కిందటే ఆయన యశోద ఆసుపత్రికి వెళ్లారు. ఆయన వెంట కొందరు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు.

    ఆసుపత్రికి చేరుకున్న వెంటనే నేరుగా కేసీఆర్ చికిత్స తీసుకుంటోన్న గదికి వెళ్లారు. ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్‌కు అందిస్తోన్న ట్రీట్‌మెంట్ గురించి డాక్టర్లు చంద్రబాబుకు వివరించారు. తుంటి ఎముక రీప్లేస్ చేశామని, ఇప్పుడిప్పుడే వాకర్ సహాయంతో నడవగలుగుతున్నారని డాక్టర్లు చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+