అతను భోజనానికి వస్తే జొన్న అన్నం పెడతా, నాకు ఆ పదవిపై ఆసక్తి లేదు
తన ఇంటికి భోజనానికి వస్తే జొన్న అన్నం పెడతానని సిఎల్ పి నాయకుడు జానారెడ్డి చెప్పారు. జానారెడ్డి ఇంటికి భోజనానికి వెళ్ళాలని కోరిక ఉందని అసెంబ్లీలో సిఎం ప్రకటించారు.
హైదరాబాద్ :భోజనానికి ముఖ్యమంత్రి కెసిఆర్ తన ఇంటికి వస్తే జొన్న అన్నం పెడతానని సిఎల్ పి నాయకుడు జానారెడ్డి చెప్పారు. అసెంబ్లీలో మంగళవారం నాడు సిఎం కెసిఆర్ జానారెడ్డి ఇంటికి భోజనానికి వెళ్తానని చెప్పాడు. అయితే తన ఇంటికి సిఎం భోజనానికి వస్తే జొన్న అన్నం పెడతానని ఆయన చెప్పాడు.
బుదవారం నాడు జానారెడ్డి సిఎల్ పి లో సరదాగా ఆయన మీడియాతో మాట్లాడారు. తన ఇంటికి భోజనానికి వస్తున్నట్టుగా సిఎం కెసిఆర్ ఇంకా తనకు చెప్పలేదన్నారు జానారెడ్డి,అయితే సిఎం ఇంటికి భోజనానికి వస్తే అన్ని రకాల వంటలను రడీ చేయిస్తానని చెప్పారు.

అసెంబ్లీ సమావేశాల తర్వాత జానారెడ్డి ఇంటికి భోజనానికి వెళ్ళే ఆలోచన ఉందని సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. అయితే జానారెడ్డి ఇంటికి భోజనానికి సిఎం ఎప్పుడూ వెళ్తారనేది ఆసక్తిగా మారింది.
తన పనితీరు బాగాలేదని ఎంఏల్ఏలు ఎవరూ చెప్పలేదన్నారు. సిఎల్ పి పదవిపై ఆసక్తి ఉంటే చెప్పాలని ఎంఏల్ఏలను కోరిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.అయితే ఇంతవరకు ఎంఏల్ఏల నుండి ఈ విషయమై ఎలాంటి ప్రతిపాదన రాలేదన్నారు జానారెడ్డి.












Click it and Unblock the Notifications