వ్యూహాత్మక మౌనం: బాబుపై తగ్గితే ఇబ్బందులని కేసీఆర్ భావిస్తున్నారా!?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గత నాలుగు రోజులుగా ఫాం హౌస్‌కు పరిమితమయ్యారు. ఆయన ఎప్పుడు మౌనంగా ఉన్నా.. తుఫాను ముందు ప్రశాంతత కావొచ్చనే చర్చ సాగుతుంది. ఇప్పుడు కూడా అదే చర్చ సాగుతోంది.
ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 అంశాలతో తెలుగు రాష్ట్రాలు హీటెక్కాయి. ఇలాంటి సమయంలో కేసీఆర్ ఫాంహౌస్‌కు పరిమితయ్యారు. ఏ అంశాల గురించి ఆయన పెదవి విప్పడం లేదు. ఫోన్ ట్యాపింగ్ గురించి కేసీఆర్ పెదవి విప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. అయినా ఆయన నుండి మౌనమే సమాధానం.
దీంతో, కేసీఆర్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారేమోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పదిమంది ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి కొని ఉంటే ప్రభుత్వం పడిపోయేదనే వాదన ఇప్పటికే ప్రచారం జరిగింది. మరోవైపు, తనను అరెస్టు చేస్తే అదేరోజు కేసీఆర్ ప్రభుత్వానికి ఆఖరు అని చంద్రబాబు ఢిల్లీలో హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు పైన కేసు పెట్టకపోతే తనకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురుకావొచ్చని కేసీఆర్ భావిస్తుండవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే, ఓటుకు నోటు కేసులో కొందరు రాజీప్రయత్నం చేసినప్పటికీ కేసీఆర్ తగ్గడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో టీడీపీకి మంచి కేడర్ ఉంది. ఓటుకు నోటు కేసులో పట్టువీడితే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయనే భావన కేసీఆర్‌లో ఉండవచ్చునని, అందుకే ఆయన తగ్గడం లేదు కావొచ్చంటున్నారు. రెండు రోజుల క్రితం కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కేసీఆర్ భేటీ అవుతారని వార్తలు వచ్చాయి. అయితే అది జరగలేదు.












Click it and Unblock the Notifications