చంద్రబాబు ఫార్ములాతో రంగంలోకి బీజేపీ- వర్కవుట్ అయ్యేనా..!!
తెలంగాణలో బీజేపీ కొత్త అస్త్రం ప్రయోగించింది. అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తినే సీఎం చేస్తామని ప్రకటించింది. ఒక సమయంలో బీజేపీ వర్సస్ బీఆర్ఎస్ గా కనిపించిన తెలంగాణ రాజకీయం ఇప్పుడు మారినట్లు కనిపిస్తోంది. ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ వర్సస్ కాంగ్రెస్ అన్నట్లుగా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఈ సమయంలో బీజేపీ తెలంగాణలో బీసీ ఓట్ బ్యాంక్ లక్ష్యంగా నిర్ణయం ప్రకటించింది. అయితే, ఈ ప్రకటన బీజేపీకి ఓట్లను తెచ్చి పెడుతుందా. ఈ ఫార్ములాతో లాభమా - నష్టమా.
బీజేపీ బీసీ కార్డు : తెలంగాణలో తమ బలం ఏంటో బీజేపీ పూర్తిగా గుర్తించింది. తెలంగాణలో హంగ్ అసెంబ్లీ ఖాయమని..తమదే కింగ్ మేకర్ పాత్ర అని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటి వరకు డబుల్ ఇంజన్ సర్కార్ నినాదం వినిపించిన బీజేపీ నేతలు ఇప్పుడు బీసీ కార్డు తెలంగాణలో ఓట్లకు బ్రహ్మాస్త్రంగా భావిస్తున్నారు. తాజాగా సూర్యాపేట సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాము అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్ది సీఎం అవుతారని ప్రకటించారు.

ఉత్తరప్రదేశ్ లో అనుసరించిన బీసీ ఫార్ములానే తెలంగాణలోనే అమలు చేయటం ద్వారా ప్రయోజనం ఉంటుందనేది ఆ పార్టీ నేతల అంచనా. ఎక్కువ మంది బీసీ నేతలకు, మహిళలకు టిక్కెట్లు ఇవ్వడంతో పాటు, మేనిఫెస్టోలో కూడా బీసీ డిక్లరేషన్ హామీలతో పాటు, బీసీ వ్యక్తినే సీఎం అభ్యర్థిగా పూర్తిగా కలిసి వచ్చే అంశంగా బీజేపీ భావిస్తోంది. అయితే, బీసీ అయిన బండిని తప్పించి కిషన్ రెడ్డికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు బీజేపీ అప్పగించిన అంశాన్ని ప్రతిపక్షాలు గుర్తు చేస్తున్నాయి.
నాడు చంద్రబాబు నినాదం : 2014 ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇదే తరహా ప్రకటన చేసారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్ది సీఎం అవుతారని నాడు ప్రకటించారు. బీసీ సంఘాల నేత క్రిష్ణయ్యను సీఎం చేస్తామని చెప్పారు. ఆ ఎన్నికల్లో క్రిష్ణయ్య టీడీపీ నుంచి ఎల్బీ నగర్ అభ్యర్దిగా పోటీ చేసి గెలుపొందారు. కానీ, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు బీజేపీ ఈ నినాదం తెలంగాణలో తెర మీదకు తెచ్చింది.
తెలంగాణలో నాలుగ కోట్ల జనాభా లో బీసీ ఓటర్లు ఎక్కువ. బీసీల జనాభా దాదాపుగా 53.50 శాతంగా అంటే సుమారు రెండు కోట్ల 18 లక్షలుగా ఉంది. ఎస్సీలు 18.48 శాతం కాగా, ఎస్టీలు 11.74 శాతం, మైనార్టీలు 10.06 శాతం ఉన్నట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఓసీలు 5 శాతం ఉన్నాయి. తెలంగాణలో ముక్కోణపు పోటీ ఉండటంతో..బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే బీజేపీ బీసీలకు ఎక్కువ సీట్లు ప్రకటిస్తోంది. దీని ద్వారా మెజార్టీ ఓట్ బ్యాంక్ కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది.

బీజేపీకి కలిసొచ్చేనా : బీజేపీ ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నా ప్రధానంగా సోషల్ ఇంజనీరింగ్ పైనే ఆశలు పెట్టుకుంటుంది. పలు రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకొచ్చిందీ ఈ సామాజిక లెక్కలే. ఇప్పటికే మహిళా బిల్లు ఆమోదం ద్వారా బీసీలు, మహిళలను ఆకట్టుకొనే వ్యూహాలను బీజేపీ అమలు చేస్తోంది. బీసీ కమిషన్ కు రాజ్యాంగ బద్దత..కేంద్ర మంత్రివర్గంలో బీసీలకు ప్రాధాన్యత..పీఎం - విశ్వకర్మ లాంటి పథకాలకు భారీ ప్రచారం ద్వారా బీజేపీ ముందుకు వెళ్తోంది.
బీఆర్ఎస్ - కాంగ్రెస్ సంక్షేమం పేరుతో ఉచిత హామీలతో ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికి భిన్నంగా సోషల్ ఇంజనీరింగ్ ఆధారంగా తెలంగాణలో బీజేపీ వేస్తున్న అడుగులు ఎన్నికల్లో ఎంత వరకు ఫలిస్తాయనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. అయితే, ఈ నినాదం తక్షణం ఎంత మేర లాభం కలిగిస్తుందనే దాని కంటే..దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే ప్రకటన చేసినట్లు స్పష్టం అవుతోంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications