మందుబాబులకు షాక్ - బార్లు, వైన్స్ బంద్..!!
మందుబాబులకు షాకింగ్ న్యూస్. రెండు రోజుల పాటు హైదరాబాద్ నగరంలో బార్లు, వైన్ షాపులు బంద్ కానున్నాయి. నగరంలో వినాయక నిమజ్జనం వేళ ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నగరంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనాలు మొదలయ్యాయి. పెద్ద ఎత్తున జరిగే ఈ నిమజ్జనం కోసం పోలీసులు పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలో ప్రధానంగా బడా గణేష్ విగ్రహం ప్రాంతం నుంచి నిమజ్జనం పెద్ద ఎత్తున జరిగే నక్లెస్ రోడ్ వరకు పూర్తి నిఘా ఏర్పాటు చేసారు. నగరంలో నిమజ్జనం నాడు ట్రాఫిక్ మళ్లింపు పైన ఇప్పటికే ప్రకటన చేసారు. ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్, ఖైరతాబాద్ మార్గంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

ఇక, నగరంలో గణేష్ నిమజ్జనం కు ఉన్న ప్రత్యేక ప్రాధాన్యత కారణంగా పోలీసులు మరిన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. నగరంలోని బడా గణేషుడైన ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం సెప్టెంబర్ 17న నిర్వహించనున్నారు. నిమజ్జనం 18వ తేదీ సైతం కొనసాగే అవకాశం ఉంది. దీంతో, సెప్టెంబర్ 17వ తేదీన ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలతో పాటు కళ్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, మూసేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications