అనారోగ్యంతో భయమేస్తోంది: మహిళ ఆత్మహత్య, వీడియో రికార్డు
హైదరాబాద్: రాజధాని హైదరాబాదులోని ఏఎస్ రావు నగర్‌లో ఓ వివాహిత సూసైడ్ వీడియో రికార్డ్ చేసి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన గురువారం నాడు చోటు చేసుకుంది. ఆత్మహత్యకు ముందు ఆమె సెల్‌ఫోన్లో వీడియోగా చిత్రీకరించడం గమనార్హం.
తన మృతికి ఎవరూ కారణం కాదని, ఆరోగ్య కారణాల వల్లనే తాను చనిపోతున్నానని ఆమె వీడియో సూసైడ్ రికార్డింగులో పేర్కొంది. తనకు బీబీ డౌన్ అవుతోందని, నిద్రపట్టడం లేదని, విపరీతంగా భయమేస్తోందని, తన చావుకి నాభర్త, అత్తమామలకు ఎలాంటి సంబంధం లేదని, అందరూ తనను క్షమించాలని పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

గొలుసు దొంగ అరెస్ట్
గొలుసు చోరీలకు పాల్పడుతున్న సోను కుమార్ అనే దొంగను పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 500 గ్రాముల బంగారం, ఓ ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. సోను కుమార్‌పై గతంలో 14 కేసులు ఉన్నాయి.
పిడుగుపాటుకు ముగ్గురు మృతి
మహబూబ్ నగర్ జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. వాతావరణంలో ఏర్పడిన మార్పులతో గురువారం సాయంత్రం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులువచ్చాయి. దీంతో దామరగిద్ద మండలంలో తల్లీకూతురు మృతి చెందారు. తలకొండపల్లి మండలంలో మరో బాలుడు మృతి చెందాడు.












Click it and Unblock the Notifications