మహిళ శవం: ముఖానికి లుంగీ, మెడుకు చున్నీ చుట్టి ఉరేశారా?
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా రాఘవాపురం గ్రామ సమీపంలోని ముక్కిడి గుట్ట చెట్ల పొదల్లో బయటపడిన ఓ గుర్తు తెలియని మహిళ శవం కలకలం సృష్టిస్తోంది. ముఖం కనిపించకుండా ముఖానికి లుంగీ చుట్టి ఉంది. మెడకు చున్నీ చుట్టి ఉంది. దీన్ని బట్టి ఆమెను ఎవరో హత్య చేసిన చెట్ల పొదల్లో పడేసినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మృతి చెందిన మహిళ వయస్సు 28 ఏళ్లు ఉంటుందని అంచనా. చెట్ల పొదల్లో పడి ఉన్న శవాన్ని చూసిన గొర్రెల కాపరి పోలీసులకు సమాచారం అందించాడు. రామన్నపేట సిఐ బాలగంగిరెడ్డి, క్లూస్ టీం పోలీసు జాగిలాలతో ఆయన సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

పోలీసు జాగిలం మృతదేహం ఉన్న స్థలం నుంచి గుట్ట పరిసర ప్రాంతంలో అటూ ఇటూ కలియదిరిగింది. తర్వాత గుట్ట దిగి రాఘవాపురం - నర్సాపురం రోడ్డు వద్ద గల ట్రాన్స్‌ఫారం వద్దకు వచ్చి ఆగిపోయింది. మహిళ శవం కుళ్లిపోయి ఉంది.
ఈ నెల 6వ తేదీ ఉదయం 5 గంటల 51 నిమిషాలకు శంషాబాద్ నుంచి శివరాంపల్లికి బయలుదేరినట్లుగా మహేశ్వరం డిపోకు చెదిన ఆర్టీసి బస్సు టికెట్ సంఘటనా స్థలానికి కొద్ది దూరంలో లభించింది. సంఘటనా స్థలంలో పది రూపాయల నోట్లు రెండు, జోడా బైల్ ఖైనీ ప్యాకెట్లు రెండు లభ్యమయ్యాయి.












Click it and Unblock the Notifications