ప్రభుత్వ ఉద్యోగం రాలేదని..
కరీంనగర్: కథలాపూర్ మండల కేంద్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. సోమవారం ఉదయం ఆకుల శృతి(27) సోమవారం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శృతి ఎంకాం పూర్తి చేసింది. పోటీ పరీక్షల కోసం ప్రిపేరవుతోంది.
ఇటీవలే గ్రూప్1, 2 పరీక్ష రాసినా మంచి ర్యాంక్ రాలేదు. మరోవైపు, శృతి తండ్రి అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు.శృతి కూడా ఏడాది కాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. చికిత్స చేయించుకుందామంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఈ నేపథ్యంతో తీవ్ర మనస్తాపానికి గురైన శృతి ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శృతి తల్లి రోజా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో మహిళపై గ్యాంగ్‌రేప్..
నాగర్‌కర్నూల్ జిల్లాలో దైవదర్శనానికి వచ్చిన భక్తురాలిని మూడు గంటలపాటు హింసించి.. సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనకు సంబంధించిన వివరాలను మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. ఊర్కొండపేటలో అత్యాచార ఘటనా స్థలిని ఆయన మంగళవారం పరిశీలించారు.
సామూహిక అత్యాచార కేసులో ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఐజీ తెలిపారు. మహిళ ఒంటరిా రావడాన్ని నిందితులు అదనుగా తీసుకున్నారని చెప్పారు. నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపిస్తామన్నారు. బెదిరించి దోపిడీలకు పాల్పడినట్లు నిందితులపై గతంలో కేసులున్నాయన్నాయని తెలిపారు.
పార్కులకు వచ్చే మైనర్లను బెదిరించి డబ్బులు లాక్కేనేవారని ఐజీ తెలిపారు. ఎవరెవరి వద్ద నిందితులు డబ్బులు లాక్కున్నారో వివరాలు సేకరిస్తామని చెప్పారు. జాతరలు జరిగే ఆలయాల వద్ద గస్తీ పెంచుతామన్నారు.












Click it and Unblock the Notifications