యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ముట్టడి.!వ్యూహం మార్చి ఎటాక్.!షాక్ తిన్న పోలీసులు.!

హైదరాబాద్ : రాష్ట్ర బ‌డ్జెట్‌లో నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించ‌నందుక నిర‌స‌న‌గా యూత్ కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు రాష్ట్ర అధ్య‌క్షుడు కె. శివ‌సేన రెడ్డి ఆధ్వ‌ర్యంలో అసెంబ్లీని ముట్ట‌డించారు. నిరుద్యోగ భృతిని వెంటనె విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు రాష్ట్రం నలుమూలలనుండి హైదరాబాద్ చెరుకున్న యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎప్పటిలాకాకుండా విడతల వారీగా అసెంబ్లీని ముట్టడించడంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మార్మోగిపోయాయి.

 ఒకేసారి కాకుండా వ్యూహం మార్చి విడతలుగా ముట్టడి.. అయోమయంలో పోలీసులు..

ఒకేసారి కాకుండా వ్యూహం మార్చి విడతలుగా ముట్టడి.. అయోమయంలో పోలీసులు..

సోమవారం ఉదయం 11 గంటలకు సుమారు వందమంది యూత్ కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ గేట్2 వద్దకు చేరుకొని పెద్దఎత్తున నినాదాలు చెస్తూ అసెంబ్లీ ప్రాంగణంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చెసారు. ఆందోలన కారులను అరెస్టు చేసిన పొలీసులు నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత మద్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, రంగారెడ్డి జిల్ల యువజన కాంగ్రెస్ కమిటి అధ్వర్యంలో మరో వందమంది పబ్లిక్ గార్డెన్ నుండి అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్దకి చేరుకుని లోపలికి వెళ్లేందుకు తీవ్రప్రయత్నం చేసారు. పోలీసులు వారిని అరెస్టు చేసి రాంగోపాల్ పెట్ పోలీసు స్టేషన్ కి తరలించారు.

 యూత్ కాంగ్రెస్ మెరుపు ముట్టడి.. నినాదాలతో మార్మోగిన అసెంబ్లీ పరిసరాలు..

యూత్ కాంగ్రెస్ మెరుపు ముట్టడి.. నినాదాలతో మార్మోగిన అసెంబ్లీ పరిసరాలు..

సుమారు ఒంటి గంట ప్రాంతంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అద్యక్షులు శివసేన రెడ్డి అధ్వర్యంలో ప్రధాన కార్యదర్శులు ప్రభాకర్ ముదిరాజ్, శ్రవణ్ రావ్, రమాకాంత్ రెడ్డి, సాగరిక రావు, సామ్రాట్, ప్రతాప్ తదితరులతో రెండువందల మంది సిసిఎస్ పోలీస్ స్టేషను వైపునుండి ఒక్కసారిగా అసెంబ్లీ వైపు దూసుకొచ్చారు అవాక్కయిన పొలీసులు నిలువరించడానికి చాలా శ్రమపడ్డారు. నాయకులంతా అసెంబ్లీ గేట్ వద్ద అడ్డంగా రోడ్డుమీదనే పడుకోవడంతో ట్రాఫిక్ భారీ ఎత్తున నిలిచిపోయింది దాదాపు అరగంట శ్రమించిన పొలీసులు యువజన కాంగ్రెస్ నాయకులను అరెష్టు చూసి నాంపల్లి, గాంధీ నగర్ పొలీసు స్టేషన్లకు తరలించారు.

 ఉదయం 11 గంటలనుండి 2 గంటలవరకు ముట్టడి... నెవ్వర పోయిన పోలీసులు..

ఉదయం 11 గంటలనుండి 2 గంటలవరకు ముట్టడి... నెవ్వర పోయిన పోలీసులు..

ఆ తర్వాత ఎల్బీ స్టేడియం నుండి హైదరాబాద్ జిల్లా అద్యక్షులు మోత రోహిత్, ఖమ్మం జిల్లా అద్యక్షుడు సంతోశ్ ఆధ్వర్యంలో వందమంది కార్యకర్తలు అసెంబ్లీ వైపు దూసుకొచ్చారు. పొలీసులు అరెస్టు చేసి ముషీరాబాద్, గాంధి నగర్, చిక్కడపల్లి పొలీసు స్టేషనలకు తరలించారు. చివరగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు సర్పంచుల సంఘం రాష్ట్ర అద్యక్షురాలు ధనలక్ష్మి ఆధ్వర్యంలో మరికొంతమంది 3 గంటల ప్రాంతంలో రవీంద్రభారతి నుండి అసెంబ్లీ ఎగ్జిట్ గేట్ వైపు వచ్చి ముట్టడి చేశారు. రాష్ట్ర వ్యాపితంగా ఎక్కడికక్కడ యువజన కాంగ్రెస్ నాయకుల ను అరెష్టు చేసినప్పటికీ భారీ ఎత్తున అసెంబ్లీ వద్దకి యువత చేరుకోవడంతో పొలీసులు ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు.

 యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అరెస్టు.. నిరుద్యోగ భృతి ఇవ్వకపోతే మంత్రుల ఇళ్లు ముట్టడిస్తామన్న నేతలు..

యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అరెస్టు.. నిరుద్యోగ భృతి ఇవ్వకపోతే మంత్రుల ఇళ్లు ముట్టడిస్తామన్న నేతలు..

ఈ సందర్బంగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర నేతలు స్పందిస్తూ యువత దెబ్బకి తట్టుకుని నిలబడటం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తరం కాదని వెంటనె నిరుద్యోగ భృతి విడుదల చెయ్యకపోతే ఈ సారి మంత్రులు, ఎమ్యెల్యేల ఇండ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సంద‌ర్భంగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్య‌క్షుడు కె. శివ‌సేన రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సర్కార్‌కు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయని మండిప‌డ్డారు. 2018లో గెలిచిన సందర్బంగా 3016 నిరుద్యోగ భృతి ఇస్తాన‌న్న చంద్రశేఖర్ రావు ఇప్పుడు ఆ ఊసే ఎత్త‌ట్లేద‌ని విమ‌ర్శించారు. వెంట‌నే నిరుద్యోగుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పి నిరుద్యోగ భృతి ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+