షర్మిలకు కాంగ్రెస్ తాజా ఆఫర్, కాదంటే - ఫైనల్ డెసిషన్..!!

వైఎస్ షర్మిల(YS Sharmila)కు కాంగ్రెస్ నుంచి తాజాగా మరో ఆఫర్ అందింది. ఇప్పటికే కాంగ్రెస్(Congress) లో చేరిక..పార్టీ విలీనం పైన కొంత కాలంగా తర్జన భర్జనలు సాగుతున్నాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shiva Kumar)ను మరోసారి షర్మిల కలిసారు. తెలంగాణ(Telangana)లో క్రియాశీలకంగా పని చేయాలని షర్మిల భావిస్తుంటే స్థానిక కాంగ్రెస్ నాయకత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో షర్మిలకు ప్రాధాన్యత దక్కే అవకాశం కనిపించటం లేదు. దీంతో, ఇప్పుడు ఫైనల్ డెసిషన్ దిశగా అడుగులు వేస్తున్నారు.

షర్మిల డిమాండ్ పట్టించుకోలేదా : వైఎస్ షర్మిల తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టాలనే ఆలోచనతో ఉన్నారు. దీని కోసమే కాంగ్రెస్ లో చేరిక ..పార్టీ విలీనం పైన సుదీర్ఘ మంతనాలు జరిపారు. డీకే శివకుమార్(DK Shiva Kumar) తో మొదలైన రాయబారం..తరువాత ఢిల్లీలో నేరుగా సోనియా, రాహుల్ తోనూ సమావేశమయ్యారు. వైఎస్సార్ కుమార్తెగా షర్మిలకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని సోనియా హామీ ఇచ్చారు.

YS Sharmila meets DK Shiva Kumar, Final Discussions on YSRTP merge with Congress

అదే సమయంలో ఏపీలో కాకుండా తెలంగాణకు మాత్రమే తాను పరిమితం అవుతానని షర్మిల స్పష్టం చేసారు. కానీ, తెలంగాణ కాంగ్రెస్ లో షర్మిలకు ప్రాధాన్యత..అసెంబ్లీ సీటు విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్(TPCC Chief Revanth) తో సహా మరి కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో,కాంగ్రెస్ హైకమాండ్ మరో తాజా ప్రతిపాదనతో షర్మిలతో చర్చలు ప్రారంభించింది.

డీకేతో మరోసారి భేటీ : షర్మిల వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని గతంలో ప్రకటించారు. కాంగ్రెస్(congress) లో చేరిక సమయంలోనూ ఇదే షరతు ఆధారంగా చర్చలు మొదలయ్యాయి. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ అభ్యర్దుల ఖరారు ప్రక్రియ వేగవంతం చేసింది. పాలేరు నుంచి మాజీ ఎంపీ పొంగులేటి(Ponguleati), మాజీ మంత్రి తుమ్మల(Tummala) మధ్య పోటీ ఉంది. వారిలో ఒకరికి పాలేరు(Paleir) ఖాయం కానుంది.

పొంగులేటి పాలేరు నుంచి, తుమ్మల ఖమ్మం నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు. షర్మిలకు అసెంబ్లీ సీటు లేదని దాదాపు తేలిపోయింది. దీంతో షర్మిల ఏం చేయాలనే డైలమాలో ఉన్నారు. ఈ సమయంలోనే మరోసారి డీకే శివకుమార్ తో సమావేశం అయ్యారు. ఆ సమయంలో కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేయాలని..పార్టీలో జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కేలా నిర్ణయం ఉంటుందని హామీ ఇచ్చినట్లు సమాచారం.

YS Sharmila meets DK Shiva Kumar, Final Discussions on YSRTP merge with Congress

తాజా ఆఫర్ పై నిర్ణయం : షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే..కర్ణాటక నుంచి రాజ్యసభ(Rajyasabha)కు పంపటంతో పాటుగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తనతో పాటుగా తన మద్దతు దారులకు అయిదు సీట్లు ఇవ్వాలని గతంలో షర్మిల ప్రతిపాదించారు. ఇప్పుడు అవి అమలయ్యే పరిస్థితి కనిపించటం లేదు.

దీంత నిరాశకు గురైన షర్మిల(YS Sharmila) పార్టీ విలీనం పైన పునరాలోచనలో పడ్డారు. ఇప్పుడు డీకేతో చర్చల ద్వారా పార్టీ పదవి ద్వారా ఎక్కడైనా పని చేసే అవకాశం ఉంటుందని..రాజ్యసభ సీటు ఖాయమని చెప్పారని సమాచారం. దీంతో, ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో సర్దుకుపోయే ధోరణితోనే షర్మిల తాజా ఆఫర్ పైన నిర్ణయం తీసుకొని..సోనియా(Sonia Gandhi)ను కలిసేందుకు సిద్దమయ్యారు. ఒకటి రెండు రోజుల్లోనే షర్మిల తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+