రేవంత్ రెడ్డి ఇలాకా కొడంగల్ లో వైఎస్ షర్మిల పాదయాత్ర నేటినుండి.. షెడ్యూల్ ఇదే!!
వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రను నేటి నుండి పునఃప్రారంభిస్తున్నారు. ఈరోజు నుండి వైయస్ షర్మిల కొడంగల్ నియోజకవర్గంలో ప్రజాప్రస్థానం పాదయాత్రను చేపట్టనున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ ఐదు రోజుల పాటు వైఎస్ షర్మిల నిర్వహించనున్న పాదయాత్రపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కొడంగల్ నియోజకవర్గం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇలాకా కావడంతో వైయస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రలో రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేస్తారా.. లేదా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది.

ఐదు రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో వైఎస్ షర్మిల పాదయాత్ర
నేడు వైఎస్ షర్మిల కొడంగల్ నియోజకవర్గంలో పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు .ఇక ఐదు రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో సాగనున్న వైయస్ షర్మిల పర్యటన వివరాలను చూస్తే ఆగస్టు 9వ తేదీన కొడంగల్ నియోజకవర్గ కేంద్రం బండెల ఎల్లమ్మ దేవాలయం నుండి ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఇక మొదటి రోజు ప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ షర్మిల పాల్గొంటారు.

నియోజకవర్గంలో అన్ని మండలాలోనూ షర్మిల పర్యటన
ఆగస్టు 10వ తేదీన పెద్ద నందిగామ క్రాస్ రోడ్డు నుండి పాదయాత్ర ప్రారంభమవుతుంది. పర్సాపూర్, హస్నాబాద్ మీదుగా కొత్తగా ఏర్పడ్డ దుద్యాల మండలంలోని దుద్యాల, లగ చర్ల గ్రామ స్టేజి వరకు పాదయాత్రను కొనసాగిస్తారు. ఆగస్టు 11వ తేదీన దుద్యాల మండలం హకీంపేట్ నుండి ప్రారంభమై పోలేపల్లి స్టేజీ, కోస్గి మండలం లోని సర్జఖాన్ పేట, కోస్గి, చెన్నారం గ్రామాల మీదుగా యాత్ర కొనసాగి ఆపై ముక్తిపాడు చేరుతుంది. అక్కడ వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించి ప్రజలతో మాట్లాడడంతో 11వ తారీఖు పర్యటన ముగుస్తుంది.
Recommended Video


మారుమూల తండాలలోనూ షర్మిల పర్యటన .. వైఎస్ విగ్రహావిష్కరణలు...
ఆగస్టు 12వ తేదీన కోస్గి మండలం ముశ్రీఫాలో పాదయాత్ర ప్రారంభమవుతుంది. దౌల్తాబాద్ మండలంలోని సూరాయిపల్లి, బోల్వోనిపల్లి, బంటోని బావులు, చల్లాపూర్ వరకు కొనసాగి ఆపై ఎడ్లపల్లి గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు వైయస్ షర్మిల. అనంతరం ఊరకుంట, దౌల్తాబాద్ వరకు యాత్ర కొనసాగనుంది. ఆపై ఆగస్టు 13వ తేదీన దౌల్తాబాద్ నుండి యాత్ర ప్రారంభమై పోచమ్మ గడ్డ, ర్యాలకుంట, రామన్న కుంట తండా, తిమ్మారెడ్డిపల్లి క్రాస్ రోడ్డు, గోక ఫస్లా బాద్, పోల్కంపల్లి క్రాస్, నంద్యా నాయక్ క్రాస్ రోడ్డు మీదుగా దేవర ఫస్లాబాద్ వరకు కొనసాగుతుంది.

నాగిరెడ్డి పల్లి లో ప్రజాప్రస్థాన యాత్ర ముగింపు
ఇక అదే రోజు మద్దూరు మండలంలోని దమగన్ పూర్ లో మాటా ముచ్చట తో, నాగిరెడ్డి పల్లి లో ప్రజాప్రస్థాన యాత్ర ముగియనుంది. అయితే గత కొద్ది రోజుల క్రితం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి వైయస్ విజయమ్మ ను కలవడం, ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గం లో వైయస్ షర్మిల పాదయాత్ర చేస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications