పోలీస్ స్టేషన్‌కు వైఎస్ విజయమ్మ
హైదరాబాద్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అరెస్ట్ అయ్యారు. జూబ్లీహిల్స్ లోటస్‌పాండ్ వద్ద గల నివాసం వద్ద పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే వైఎస్ఆర్టీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జూబ్లీ హిల్స్‌కు చేరుకున్నారు. దీనితో లోటస్ పాండ్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సిట్ కార్యాలయానికి బయలుదేరిన ఆమెను లోటస్ పాండ్ నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను కారు ఎక్కనివ్వలేదు. దీనితో రోడ్డు మీదే నడుచుకుంటూ ప్రగతి భవన్ వైపు బయలుదేరారు. ఆ సమయంలో పోలీసులు చుట్టుముట్టారు. ముందుకు కదలనివ్వకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన షర్మిల ఓ మహిళా కానిస్టేబుల్ చెంప పగులగొట్టారు.

షర్మిలను ఇంటికి పంపించడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలేవీ కొలిక్కి రాకపోవడంతో ఆమెను అరెస్ట్ చేశారు. తమ వాహనంలో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున వైఎస్ఆర్టీపీ నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. షర్మిలను విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. అక్కడే బైఠాయించారు. దీనితో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఆ కొద్దిసేపటికే షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసులు ఆమెను రోడ్డుపైనే అడ్డుకున్నారు. లోనికి రానివ్వలేదు. ఈ సందర్భంగా విజయమ్మ- పోలీసుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తన కుమార్తెను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. ఆమెను ఎందుకు పరామర్శించనివ్వట్లేదని నిలదీశారు. దీనికి నిబంధనలు అంగీకరించవంటూ పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
Y. S. Vijayamma the wife of Ex Cm #YSR and mother of #AndhraPradesh CM #YSJagan slapped a constable who was stopping her to go out and meet arrested daughter #YSSharmila. #Hyderabad https://t.co/NONE1JLxux pic.twitter.com/SMLJAV4QeU
— Ashish (@KP_Aashish) April 24, 2023
పేపర్ లీకుల్లో ఉద్యోగులు మాత్రమే ఉంటే సీబీఐ దర్యాప్తునకు కేసీఆర్ అండ్ బ్యాచ్ ఎందుకు భయపడుతోందంటూ వైఎస్ షర్మిల నిలదీశారు. సీబీఐ పేరు చెప్తేనే కేసీఆర్‌కు వణుకు పుడుతోందని, దీన్ని బట్టి చూస్తే- అసలు దొంగలు ప్రగతి భవన్‌లోనే ఉన్నారనే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే పేపర్ లీకులపై సీబీఐ విచారణకు ఆదేశించాలని, ప్రస్తుత టీఎస్‌పీఎస్సీ బోర్డును తక్షణం రద్దు చేసి కొత్త దాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications