YS Sharmila: అరుదైన ఘనత సాధించిన వైఎస్ షర్మిల..
రాజకీయాల్లో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలి వైఎస్ షర్మిల రికార్డు సృష్టించారు. ఆమె ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు దక్కించుకున్నారు. షర్మిల చేసిన పాదయాత్రకు ఈ అరుదైన ఘనత లభించింది. వైఎస్ షర్మిల 2021 అక్టోబర్ 20 నుంచి చేవెళ్లలో పాదయాత్ర ప్రారంభించారు. ఆమె దాదాపు సంవత్సరన్నర పాదయాత్ర చేశారు.
తెలంగాణలో 3,800 కిలోమీటర్ల దూరం నడిచిన తొలి మహిళగా షర్మిల ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కారు. ఆగస్టు 15న స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధులు షర్మిలకు అవార్డు అందజేశారు. వైఎస్సాఆర్ తనయగా ప్రజల్లోకి వెళ్లిన షర్మిలకు పలు చోట్ల మంచి ఆదారణే లభించింది.

పాదయాత్రలో వైఎస్ షర్మిల పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే కేసీఆర్, మంత్రలుపై కూడా విమర్శలు చేశారు. అలాగే నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో నర్సంపేటలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
దీంతో ఆమె పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కానీ షర్మిల పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించారు. కోర్టుకు వెళ్లి పాదయాత్రకు అనుమతి తెచ్చుకున్నారు. వైఎస్సాఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. షర్మిల ఇప్పటికే ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధిష్ఠానంతో సంప్రదింపులు కూడా జరిపారు.
షర్మిలకు కాంగ్రెస్ పెద్దలకు మధ్య మధ్యవర్తిగా కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. షర్మిల కాంగ్రెస్ లోకి రావడంపై పలువురు కాంగ్రెస్ నేతలు స్పందించారు. షర్మిల తమ పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications