Street Food: మిర్చి, సమోసాలు తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..!

సమోసాలు, పకోడీ, మిర్చి, బజ్జీలు చూడగానే చాలా మందికి నోరు ఊరుతుంది. చాలా టెస్టీగా ఉండే ఈ స్ట్రీట్‌ ఫుడ్ ను చాలా ఇష్టపడతారు. చాలా మంది రెగ్యూలర్ గా మిర్చి బజ్జీ, సమోసా, అలు బజ్జీలు తింటారు. ఇలా తినడం ప్రమాదకరమని నిపుణులు వివరిస్తున్నారు. వీటిని తయారు చేయడానికి చాలా మంది నాసిరకం నూనెలు వాడుతుంటారు. నాసిరకంతో చేసిన బజ్జీలు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయట. అలాగే స్ట్రీట్ సైడ్ ఫడ్ తయారు చేసే వారు వాడిన నూనె మళ్లీ వాడతారు. ఇలా చేయడం కూడా మంచిది కాదట.

ఇలాంటి నూనెలతో చేసిన మిర్చిలు, సమోసాలు, బజ్జీలు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉందట. క్రమం తప్పకుండా తింటే అనారోగ్యం పాలవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది స్ట్రీట్‌ ఫుడ్స్‌ చేసే క్రమంలో వాడిన నూనె మళ్ళీ వాడుతున్నారు. ఇలా చేయడం వల్ల నూనెలోని పోషకాలు తొలగిపోయి నూనె కలుషితంగా మారుతుంది. నూనెను మళ్లీ మళ్లీ వేడి చేసి చేయడం వల్ల అందలో క్యాన్సర్ కారకాలు పుట్టుకొస్తాయట.

 There is a possibility of getting cancer if you eat Mirchi and samosas made with used oil

నూనెను ఒక సారి వినియోగించామంటే మళ్లీ దానిని వినియోగించకుండా ఉండడం మేలట. అయితే తరుచుగా వినియోగించడం వల్ల నూనె రంగు మారి.. అది కలుషిత నూనెలా మారుతుందట. వీటితో చేసిన వంటకాలను తినడం వల్ల కాన్సర్ వచ్చే అవకాశం ఉందట. కలుషితమైన నూనెను పదే పదే వాడడం వల్ల గుండెలోని ధమనులలో కొవ్వు పెరిగి గుండె సమస్యలు వచ్చే అవకాశాలు అధికమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+