మేము డిసిప్లిన్‌గా ఉంటాం- తిరుపతి ఎస్పీకి పవన్ కల్యాణ్ కంప్లైంట్..!!
తిరుపతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇవ్వాళ తిరుపతిలో ప్రత్యక్షం అయ్యారు. భారీ కాన్వాయ్‌తో ఎంట్రీ ఇచ్చారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఇతర నాయకులతో కలిసి విజయవాడ గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయన రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది.
ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, పార్టీ నాయకులు చిలకం మధుసూధన్ రెడ్డి, కిరణ్ రాయల్, రామ్‌దాస్ చౌదరి, జే రాజారెడ్డి, వినుత కోట, ఆకేపాటి సుభాషిణి, తాతంశెట్టి నాగేంద్ర.. పవను్ కల్యాణ్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ మీదుగా రేణిగుంట, జంక్షన్, గాజులమండ్యం, తుమ్మలాగుంట సర్కిల్, మహిళా యూనివర్శిటీ, వెస్ట్ చర్చ్, బాలాజీ సర్కిల్ మీదుగా జనసేన పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీగా పవన్ కల్యాణ్ తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. జిల్లాలోని శ్రీకాళహస్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అంజు యాదవ్‌పై లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. శ్రీకాళహస్తికి చెందిన పార్టీ కార్యకర్త కొట్టె సాయిపై చేయి చేసుకున్న సీఐ అంజు యాదవ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారాయన. తమ పార్టీ కార్యకర్తలను కొట్టే అధికారం సీఐకి ఎవరిచ్చారంటూ నిలదీశారు. శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేస్తోన్న పార్టీ నాయకులు, కార్యకర్తలను కొట్టడం ద్వారా రాజ్యాంగ ప్రాథమిక హక్కును సీఐ అంజు యాదవ్ ఉల్లంఘించారంటూ ఆరోపించారు.

మానవ హక్కుల కమిషన్.. ఈ విషయాన్ని సుమోటోగా కేసును తీసుకుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎప్పుడూ క్రమశిక్షణతో ఉంటారని అన్నారు. నిరసనలను తెలియజేసే హక్కు తమకు రాజ్యాంగం ప్రసాదించిందని, ఎలాంటి అవాంఛనీయం సంఘటనలకు పాల్పడకుండా శాంతియుతంగా తాము ధర్నా చేస్తోంటే సీఐ అంజు యాదవ్ తమ కార్యకర్తను కొట్టారని చెప్పారు.












Click it and Unblock the Notifications