Tirumala: టీటీడీ కీలక నిర్ణయం.. టికెట్లు ఉన్నవారికే ఆ అవకాశం..!

ఏప్రిల్ నెలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శన టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే మొదటిసారిగా వసతి గదుల కేటాయింపును ఆన్‌లైన్‌లో చేపట్టినట్లు ప్రకటించింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను బుధవారం విడుదల చేశారు. ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం(ఎస్‌ఈడీ) టికెట్లను భక్తులు 2 గంటల 45 నిమిషాల్లోనే బుక్ చేసుకున్నారు.

టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా భక్తులు తమ టికెట్లను బుక్ చేసుకున్నారు. ఏప్రిల్ నెలకు సంబంధించిన వసతి గదుల కోటా టికెట్లు ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. అయితే టికెట్లు ఉన్నవారికి గదులను కేటాయించారు. తిరుమల, తిరుపతిల్లో వేర్వేరుగా అనేక రకాల వసతి గదులు అందుబాటులో ఉన్నాయి. తిరుపతి ప్రధాన బస్టాండ్ సమీపంలో శ్రీనివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణువాసం వసతి భవనాలు ఉన్నాయి.

TTD Tirumala darshanam ticket holders have taken up the allotment of rooms

ఈ రెండు చోట్లా గదులను బుక్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే తిరుమలలో పద్మావతి అతిథిగృహం, శ్రీ వేంకటేశ్వర అతిథిగృహం, రామ్ బగీచా వరాహస్వామి విశ్రాంతి భవనం, ట్రావెలర్స్ బంగ్లా, నారాయణగిరి గెస్ట్ హౌస్, నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత, సప్తగిరి వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఆన్ లైన్ ద్వారా గదులను బుక్ చేసుకునే అవకాశం ఉంది. అయితే టికెట్లు ఉన్నవారికే గదులు కేటాస్తున్నారు. శ్రీవారి ఆర్జిత సేవలు, వృద్ధులు, దివ్యాంగుల టికెట్లు 23నాడే విడుదల చేశారు.

గురువారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత దర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా.. టైమ్ స్లాట్ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. బుధవార స్వామివారిని 65,991 మంది భక్తులు దర్శించుకోగా.. ఇందులో 21,959 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.3.37 కోట్లుగా ఉందని టీటీడీ అధికారులు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+