తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

TTD: తిరుమల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దం, సామాన్య భక్తులు, వీఐపీలకు అనుకూలంగా, కాలినడక !

|
Google Oneindia TeluguNews

తిరుమల/ తిరుపతి: తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు అక్టోబ‌రు 7 నుండి 15వ తేదీ వ‌ర‌కు ఏకాంతంగా నిర్వ‌హించాల‌ని టీటీడీ నిర్ణ‌యించింద‌ని ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌ అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల‌పై ఈఓ స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా టీటీడీ ఈవో మాట్లాడుతూ ఈసారి బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రిగే 9 రోజుల్లో రాష్ట్రంలో టీటీడీ ఇటీవల ఆలయాలు నిర్మించిన అన్ని జిల్లాల్లోని వెనుక‌బ‌డిన ప్రాంతాల‌కు చెందిన 500 నుండి 1000 మంది భ‌క్తుల‌ను బ‌స్సుల్లో ఉచితంగా తిరుమ‌ల‌కు తీసుకొచ్చి స్వామివారి ద‌ర్శ‌నం చేయించేందుకు విధివిధానాలు ఖరారు చేయాలని హెచ్ డిపిపి, రవాణ విభాగం అధికారులను ఆదేశించారు. బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా వేద పారాయ‌ణంలో అర్హులైన వారికి పోటీలు నిర్వ‌హించి బ‌హుమ‌తులు అంద‌జేయాలని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి అధికారులకు సూచించారు.

ఎస్వీబీసీ కన్నడ, హిందీ చానళ్లు

ఎస్వీబీసీ కన్నడ, హిందీ చానళ్లు

బ్ర‌హ్మోత్స‌వాల్లో ఎస్వీబీసీ క‌న్న‌డ‌, హిందీ ఛాన‌ళ్లు ప్రారంభించేందుకు సిఈఓ ఏర్పాట్లు చేప‌ట్టాల‌ని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి అన్నారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో వాహ‌న‌సేవ‌ల వైశిష్ట్యంపై వ‌సంత మండ‌పంలో ప్ర‌ముఖ పండితుల చేత ఉప‌న్యాస కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి అన్నారు. నాదనీరాజనం వేదికపై టిటిడి ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలు ఇతర వినూత్న కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి చెప్పారు.

 కాలినడక భక్తులకు లైన్ క్లియర్

కాలినడక భక్తులకు లైన్ క్లియర్

బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల‌కు సంబంధించిన ఇంజినీరింగ్ ప‌నులు త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ఈవో అధికారుల‌ను టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ఆదేశించారు. అలిపిరి కాలిన‌డ‌క మార్గాన్ని బ్ర‌హ్మోత్స‌వాల లోపు భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకురావాల‌ని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి అన్నారు. విశ్రాంతి గదుల్లో మాస్ క్లీనింగ్ చేపట్టాలని, మ‌ర‌మ్మతులు పూర్త‌యిన కాటేజీల‌ను భ‌క్తుల‌కు కేటాయించేందుకు సిద్ధంగా ఉంచుకోవాల‌ని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి సూచించారు.

చిన్న బ్రహ్మరథం

చిన్న బ్రహ్మరథం

వాహ‌నసేవలు జ‌రిగే ప్రాంత‌మైన ఆల‌యంలోని క‌ల్యాణ‌మండ‌పంలో చిన్న బ్ర‌హ్మ‌ర‌థం ఏర్పాటు చేయాల‌ని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి అన్నారు. ఇంజనీరింగ్ అధికారులు వాహనసేవలకు వినియోగించే వివిధ వాహనాల పటిష్టతను పరిశీలించి లోటుపాట్లను సరి చేయాలని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి చెన్నారు. బ్ర‌హ్మోత్స‌వాల రోజుల్లో భ‌క్తుల‌కు, విఐపిల‌కు ఇబ్బందులు లేకుండా భ‌ద్ర‌తా ఏర్పాట్లు, ట్రాఫిక్ క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని భద్రతా విభాగం, పోలీసు అధికారులకు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి సూచించారు.

 శ్రీవారి ఆలయంలో విద్యుత్ అలంకరణ

శ్రీవారి ఆలయంలో విద్యుత్ అలంకరణ

శ్రీ‌వారి ఆల‌యం, అన్ని కూడ‌ళ్లు ఇత‌ర ముఖ్య‌మైన ప్రాంతాల్లో శోభాయ‌మానంగా విద్యుత్ అలంక‌ర‌ణ‌లు, పుష్పాలంక‌ర‌ణ‌లు చేప‌ట్టాల‌ని సంబంధిత అధికారులను టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ఆదేశించారు. భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నం, ల‌డ్డూ ప్ర‌సాదాలు, అన్న‌ప్ర‌సాదాల్లో ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా చూడాల‌ని అధికారులకు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి సూచించారు.

అన్నప్రసాదంకు అన్ని ఏర్పాట్లు పూర్తి చెయ్యాలి

అన్నప్రసాదంకు అన్ని ఏర్పాట్లు పూర్తి చెయ్యాలి

అన్నప్రసాద భవనంలో ఉదయం 8 నుండి రాత్రి 11 గంటల వరకు భక్తులకు అన్నప్రసాదాలు అందించాలని డెప్యూటీ ఈఓను టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ఆదేశించారు. వివిధ విభాగాల్లో భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు ప‌రిమిత సంఖ్య‌లో శ్రీ‌వారి సేవ‌కుల‌ను ఆహ్వానించాల‌ని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి చెప్పారు. పారిశుద్ధ్యం చ‌క్క‌గా ఉండాల‌ని, క్ర‌మం తప్ప‌కుండా నీటి నాణ్య‌త‌ను ప‌రిశీలించాల‌ని ఆరోగ్య విభాగం అధికారుల‌కు సూచించారు.

బ్రహ్మోత్సవాల తేదీలు

బ్రహ్మోత్సవాల తేదీలు


అంతకుముందు టీటీడీ అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి మాట్లాడుతూ అక్టోబ‌రు 5న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం, అక్టోబ‌రు 6న అంకురార్ప‌ణ జ‌రుగుతాయ‌ని, బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్ర‌ధానంగా అక్టోబ‌రు 7న ధ్వ‌జారోహ‌ణం, అక్టోబ‌రు 11న గ‌రుడ‌వాహ‌న‌సేవ‌, అక్టోబ‌రు 12న స్వ‌ర్ణ‌ర‌థం(స‌ర్వ‌భూపాల వాహ‌నం), అక్టోబ‌రు 14న ర‌థోత్స‌వం(స‌ర్వ‌భూపాల వాహ‌నం), అక్టోబ‌రు 15న చ‌క్ర‌స్నానం, ధ్వ‌జావ‌రోహ‌ణం జ‌రుగుతాయ‌ని తెలియ‌జేశారు. ప్రతి ఏడాది లాగే రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తామని చెప్పారు.

Recommended Video

'Anjanadri' In Tirumala is Hanuman''s Birthplace ఆంజనేయుడి జన్మస్థలం ఎక్కడ.? || Oneindia Telugu
 అన్ని విభాగాల అధికారులు

అన్ని విభాగాల అధికారులు

ఈ స‌మావేశంలో శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, శ్రీ కృష్ణశేషాచల దీక్షితులు, శ్రీ గోవిందరాజ దీక్షితులు, టిటిడి జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, అద‌న‌పు ఎస్పీ శ్రీ మునిరామ‌య్య‌, అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, ఎఫ్ఏసిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్ బాబు, ఎస్ఇ-2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, ట్రాన్స్‌పోర్టు జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ శ్రీ శేషారెడ్డి, ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్ కుమార్‌, హెచ్‌డిపిపి ప్రోగ్రామింగ్ అధికారి శ్రీ విజ‌య‌సార‌థి, ఆరోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ శ్రీ‌దేవి ఇత‌ర అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.

English summary
TTD: Salakatla Annual Brahmotsavam & Navrathri Brahmotsavam will be held together in Tirumala Tirupati as there is no Adhika Maasa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X