Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

TTD: నేడు శ్రీవారి సేవా, దర్శన టికెట్ల కోటా విడుదల..!!

Tirumala: తిరుమలలో భక్తు రద్దీ సాధారణంగా ఉంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 27 నుంచి 29వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాల సేవా టికెట్ల కోటాను ఈ రోజు విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ నెల ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూన్ 23వ తేదీ విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబరు నెల కోటా అందుబాటులోకి తెస్తున్నారు.

నేడు టికెట్ల విడుదల:
శ్రీవారి కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను ఈ రోజు (జూన్ 22) ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. సెప్టెంబర్ నెల కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవ వర్చువల్ సేవల కోటాను, అదేవిధంగా వాటికి సంబంధించిన దర్శన టికెట్ల కోటాను ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. అదే విధంగా సెప్టెంబర్ నెల ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను రేపు (జూన్ 23) ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.

TTD to release online tickets for the Online Seva and connected Darshan quota today for the month of september

పవిత్రోత్సవాల సేవా టికెట్ల కోటా:తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 27 నుంచి 29వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాల సేవా టికెట్ల కోటాను ఈ రోజు ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. టీటీడీ అధికారిక వెబ్ సైట్.. యూప్ ద్వారా బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. తిరుమలలో భక్తుల రద్దీ క్రమేణా తగ్గుతోంది. వేసవి సెలవులు ముగియటంతో సాధారణ రద్దీ కొనసాగుతోంది.

ప్రస్తుతం శ్రీవాణి ట్రస్టు నిధుల పైన రాజకీయంగా వస్తున్న ఆరోపణల పైన టీటీడీ పాలక మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం టీటీడీపై దుష్ప్రచారం చేసేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తీర్మానించింది. శ్రీవాణితోపాటు ఇతర ఏ ట్రస్టుల్లో అయినా అవినీతి జరుగుతోందనే అనుమానం ఉంటే ఎవరైనా వివరాలు తెలుసుకోవచ్చని స్పష్టం చేసింది.

దుష్ప్రచారం సరి కాదు:హిందూ ధర్మప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆలయాలు నిర్మించడం కోసం 2019లో టీటీడీ శ్రీవాణి ట్రస్టును ఏర్పాటుచేసిందని టీటీడీ వెల్లడించింది. ఈ నిధులతో రాష్ట్రంలోని 26 జిల్లాలతోపాటు తెలంగాణ, పాండిచ్చేరి, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని గిరిజన, ఎస్పీ, మత్స్యకార గ్రామాల్లో మొత్తం 2,445 ఆలయాల నిర్మాణం జరుగుతోందని తెలిపింది. ఈ ట్రస్టు నిధులతో పురాతన ఆలయాల పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణం, ఆలయాల ధూపదీప నైవేద్యాలకు ఆర్థికసాయం అందిస్తున్నామని వివరించారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 300 పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని బోర్డు స్పష్టం చేసింది. శ్రీవాణి ట్రస్టుకు ప్రత్యేకంగా బ్యాంకు అకౌంటు ఉంది. అందులోనే విరాళాలు జమ అవుతాయి. టీటీడీ నుండి ఒక రూపాయి కూడా పక్కదారి పట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+