Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అనిత ఇటు చూడు.. వినోద్ జైన్ వల్లే విద్యార్థిని బలవన్మరణం.. రోజా ఫైర్

ఏపీలో అధికార వైసీపీపై టీడీపీ విమర్శలు చేస్తూనే ఉంది. నిన్న ఆ పార్టీ నేత అనిత తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ లైంగికదాడి జరిగిన వైసీపీ కార్యకర్తల ప్రమేయం ఉంటుందని ఆరోపించారు. దీంతో ఇవాళ వైసీపీ నేత రోజా స్పందించారు. ఓ బాలిక సూసైడ్‌కు టీడీపీ నేత కారణం అని తెలియడంతో శివాలెత్తిపోయారు. టీడీపీ నేతలు ఏం చేస్తున్నారో రాష్ట్రం చూస్తుంది అని కామెంట్ చేశారు. ఆ పార్టీ వారు తప్పు చేసి.. నింద తమపై మోపడం ఏంటీ అని అడిగారు.

9వ తరగతి విద్యార్థిని

9వ తరగతి విద్యార్థిని

విజయవాడ భవానీపురంలో 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక అపార్ట్ మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. టీడీపీ నేత వినోద్ జైన్ తనను వేధిస్తున్న విధానాన్ని ఆమె తన పుస్తకంలో రాసినట్టు తెలిసింది. సదరు టీడీపీ నేత కూడా బాలిక నివసిస్తున్న అపార్ట్ మెంట్‌లో ఉంటున్నాడు. టీడీపీ నేత వినోద్ జైన్ ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో డివిజన్ కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయాడు.

వినోద్ జైన్..

వినోద్ జైన్..

బాలిక ఆత్మహత్య ఘటన నేపథ్యంలో టీడీపీ వినోద్ జైన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. బాలిక మృతిపై పోక్సో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వినోద్ జైన్ ను అరెస్ట్ చేశారు. ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. బాలిక ఆత్మహత్యపై టీడీపీ నేతలు ఏం చెబుతారని ప్రశ్నించారు. బాలిక బలవన్మరణానికి పాల్పడడం బాధాకరమని అన్నారు. స్త్రీలపై వేధింపులకు పాల్పడే టీడీపీ నేతలు నారీ సంకల్ప దీక్ష ఎలా చేస్తారని రోజా ప్రశ్నించారు.

వృద్దుడు ఇలా..

వృద్దుడు ఇలా..


60 ఏళ్ల వ్యక్తి బాలికను తండ్రిలా చూసుకోవాల్సింది పోయి, ఎలా వేధించాడో ఆ బాలిక పుస్తకంలో రాసుకున్న దాన్నిబట్టి అర్థమవుతోందని కామెంట్ చేశారు. తప్పుడు పనులు చేసేది టీడీపీ నేతలే అని, దానిని ఇతరులపైకి నెడుతుంటారని ఆరోపించారు. ఆసుపత్రి మార్చురీ వద్ద బాలిక మృతదేహాన్ని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు. ఆమె తల్లిదండ్రులను ఓదార్చారు.

Recommended Video

    Inter Students, Farmers మానసిక స్థితిపై Psychology Expert Views | Oneindia Telugu
    అనిత ఇలా

    అనిత ఇలా


    అంతకుముందు అనిత వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. జగన్ పాలనలో మహిళల మాన, ప్రాణాలకు విలువే లేకుండా పోతోందని అనిత విమర్శించారు. మైనర్ బాలికలపై కూడా అత్యాచారాలు జరుగుతుందడం దారుణమని అన్నారు. 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగి రెండు నెలలు గడుస్తున్నా... బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదని మండిపడ్డారు. ఆ చిన్నారిపై కన్నా భూశంకర్ అనే వైసీపీ కార్యకర్త అత్యాచారం చేశాడని చెప్పారు. హోం మంత్రి సుచరిత నిస్సహాయ శాఖ మంత్రిగా మారిపోయారని ఎద్దేవా చేశారు. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని అడిగారు. ఇలా కామెంట్ చేశారో లేదో.. టీడీపీ నేత అడ్డంగా బుక్కయ్యాడు. దీంతో రోజా సెటైర్లు వేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+