విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనాలోనూ వైసీపీ రంగులు - హైకోర్టు ఆదేశాలూ బేఖాతర్- ఈసారి కృష్ణాజిల్లాలో స్కూళ్లకు..

|
Google Oneindia TeluguNews

ఏపీలో గతేడాది అధికారం చేపట్టాక ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడం ప్రారంభించిన జగన్ సర్కార్.. ఆ తర్వాత ఎన్ని విమర్శలు ఎదురైనా వాటిని లెక్కచేయలేదు. చివరికి హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో రంగుల మార్పిడి కోసం ఓ కమిటీ నియమించి, దాని సూచనల అనుగుణంగా కొత్త రంగులు నిర్ణయించింది.

చిత్తూరు జిల్లాలో శివాలయ ప్రాంగణంలో వైసీపీ రంగులు- ఎందుకిలా చేశారని అడిగితే గప్ చుప్... చిత్తూరు జిల్లాలో శివాలయ ప్రాంగణంలో వైసీపీ రంగులు- ఎందుకిలా చేశారని అడిగితే గప్ చుప్...

వాటిపైనా వివాదం రేగడంతో హైకోర్టులో అక్షింతలు తప్పలేదు. తాజాగా కృష్ణాజిల్లాలో పాత వైసీపీ రంగులను ఓ రైతు భరోసా కేంద్రానికి వేస్తుండటం కలకలం రేపింది.

ap govt continues ysrcp colouring to buildings despite high court orders

Recommended Video

IRCTC Opens Booking For Special Trains,Tickets Sold Out Within 10 Minutes

కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలోని మాలపల్లిలోని పీతురు కాల్వ పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలకూ, వెల్వడం గ్రామంలో పడమర చెరువు వద్ద స్కూల్ భవనాన్ని రైతు భరోసా కేంద్రంగా మార్చి రంగులు వేస్తున్నారు. అదీ పాత వైసీపీ రంగులనే వేస్తుండటం విశేషం. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ కొనసాగుతోంది. పాఠశాలలు పనిచేయడం లేదు. దీంతో ఇదే సరైన సమయమని భావించి రంగులు వేస్తున్నట్లు అర్ధమవుతోంది. ఈ రంగుల వ్యవహారంపై స్ధానికంగా విమర్శలు చెలరేగుతున్నాయి.

English summary
andhra pradesh govt has been continued its prestigious ysrcp colouring scheme to govt buildings in the state despite high court orders. recently officials allegedly coloured ysrcp colours to a school turned rythu bharosa centre in mylavaram constituency in krishna district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X