కేంద్రమంత్రిని అడ్డుకున్న పోలీసులు.. అన్నింటికీ అనుమతి లేదని స్పష్టీకరణ

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ర్యాలీని ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడకు ర్యాలీగా కిషన్ రెడ్డి బయలుదేరారు. ఎనికేపాడు వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని తేల్చిచెప్పారు. దీంతో పోలీసులు, బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. రెండు కార్లను మాత్రమే విజయవాడ వైపు అనుమతించారు. దీంతో కార్లు, బైకులన్నీ అక్కడే నిలిచిపోయాయి. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీవారి సేవలో

శ్రీవారి సేవలో

అంతకుముందు కిషన్ రెడ్డి తిరుపతి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. తిరుమల శ్రీవారిని ఇవాళ ఉదయం దర్శించుకున్నారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఉన్నారు. కిషన్ రెడ్డి తిరుపతి నుంచి జన ఆశీర్వాద యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర రెండు రోజుల పాటు ఏపీలో, మూడు రోజుల పాటు తెలంగాణలో కొనసాగనుంది. ఇందులో భాగంగా విజయవాడ వచ్చారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 'జన ఆశీర్వాద యాత్ర'ను ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల నుంచి శ్రీకారం చుట్టారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. కేంద్ర మంత్రులను పార్లమెంటులో పరిచయం చేసే అవకాశం రాకపోవడంతో బీజేపీ జాతీయ నాయకత్వం వారిని జనంలోకి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కిషన్‌రెడ్డి మూడు రోజుల పాటు జన ఆశీర్వాద యాత్ర చేపట్టనున్నారు.

ప్రజల్లోకి పథకాలు

ప్రజల్లోకి పథకాలు

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం.. ప్రతిపక్షాలను ఎండగట్టడం.. అజెండాగా దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రులు పర్యటించనున్నారు. 2021, ఆగస్టు 19వ తేదీ గురువారం తిరుమలేశుడిని దర్శనం చేసుకున్న తర్వాత తిరుపతిలోని వ్యాక్సినేషన్‌ సెంటర్‌ను సందర్శించారు. అక్కడి నుంచి విజ‌య‌వాడ చేరుకున్నారు. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై క‌న‌క‌దుర్గ అమ్మవారిని ద‌ర్శించుకున్నారు. పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రోడ్డు మార్గంలో తెలంగాణలోకి అడుగు పెడతారు. కోదాడ నుంచి ప్రారంభమై..శనివారం సాయంత్రం బీజేపీ కార్యాలయం వద్ద సభతో యాత్ర ముగియనుంది.

12 జిల్లాల గుండా

12 జిల్లాల గుండా

తెలంగాణ‌ రాష్ట్రంలో నిర్వహించ‌ే జ‌న‌ ఆశీర్వాద యాత్రలో భాగంగా 12 జిల్లాలు, 7 పార్లమెంట్ స్థానాలు, 17 అసెంబ్లీ సెగ్మెంట్ల మీదుగా 324 కిలోమీట‌ర్ల మేర కిష‌న్‌రెడ్డి పర్యటిస్తారు. కోదాడ వ‌ద్ద రాష్ట్రంలోకి ప్రవేశించనున్న కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డికి ఘ‌న స్వాగ‌తం ప‌లికేందుకు బీజేపీ రాష్ట్ర నాయ‌క‌త్వం ఏర్పాట్లు చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ‌తో పాటు పార్టీ ముఖ్యనేత‌లు ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌ల‌కనున్నారు. 20వ తేదీ ఉదయం సూర్యాపేట నుంచి జన ఆశీర్వాద యాత్ర కొనసాగిస్తారు. సూర్యాపేట నుంచి దంతాలప‌ల్లి, తొర్రూరు, రాయ‌ప‌ర్తి, వ‌ర్ధన్నపేట మీదుగా వ‌రంగ‌ల్‌కు చేరుకుంటారు. వరంగ‌ల్ న‌గ‌రంలో భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకొని, అమ‌రవీరుల స్థూపం వ‌ద్ద నివాళులు అర్పిస్తారు.

వ్యాక్సినేషన్ సెంటర్ ఓపెన్

వ్యాక్సినేషన్ సెంటర్ ఓపెన్

వరంగల్‌లో వ్యాక్సినేషన్‌ సెంటర్‌ను సందర్శించి.. వ్యాక్సినేషన్ కార్యక్రమం అమ‌లు తీరును తెలుసుకుంటారు. తర్వాత స‌ర్వాయి పాపన్న గ్రామం ఖిల్లాషాపూర్ నుంచి జ‌న‌గామ వెళ్తారు. ఆలేరులో చేనేత కార్మికుడు, ప‌ద్మశ్రీ అవార్డు గ్రహీత చింత‌కింద మ‌ల్లేశంను స‌న్మానిస్తారు. అక్కడినుంచి యాద‌గిరిగుట్టకు చేరుకుంటారు. యాదాద్రి ల‌క్ష్మీ న‌ర్సింహాస్వామిని ద‌ర్శించుకుని రాత్రి అక్కడే బ‌స చేస్తారు.21వ తేదీ ఉద‌యం యాదాద్రి నుంచి బ‌య‌లుదేరి భువ‌నగిరిలో కేంద్ర ప్రభుత్వం అమ‌లు చేస్తున్న ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప‌రిశీలిస్తారు. స్థానికంగా రేష‌న్ షాపుల‌ను సంద‌ర్శించి ప్రజ‌ల‌కు ఉచిత బియ్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకుంటారు. భువ‌నగిరిలో రేష‌న్ షాపులను సంద‌ర్శించిన త‌ర్వాత ఘ‌ట్‌కేస‌ర్ మీదుగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజ‌కవ‌ర్గానికి చేరుకుని, అక్కడ నుంచి నాంప‌ల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాల‌య‌నికి చేరుకుంటారు. అక్కడ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేయ‌బోతున్నట్టు పార్టీ నేతలు తెలిపారు.

Recommended Video

    Huzurabad By Poll : హరీష్ రావు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు Etela Rajender
    పార్టీ కార్యక్రమం..

    పార్టీ కార్యక్రమం..


    సాధారణంగా కేంద్రమంత్రి పర్యటన ఉంటే పోలీసులు ముందు అలర్ట్ అవుతారు. కానీ ఇదీ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కావున పోలీసులు అనుమతించలేదు. కానీ ఒకవిధంగా ఏపీ పోలీసులు సాహసం చేశారనే అనుకోవాలి. కేంద్రమంత్రితో కూడిన వాహనాలను నిలిపి.. మంచి డేర్ స్టెప్ వేశారు. దీనికి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలీ మరీ. ఒకవిధంగా పార్టీకి సంబంధించిన అంశం అయినందున పెద్దగా పట్టించుకోరు అనే వాదన ఉంది. కానీ ఏపీలో బీజేపీ బలోపేతం కావడంపై ఫోకస్ చేసింది. పైకి కేంద్రమంత్రి పర్యటన ఉన్నా.. లోన మాత్రం ఏఫీలో పార్టీని క్షేత్రస్థాయిలో బలపరచడమే లక్ష్యం అనిపిస్తోంది. అందుకోసమే పోలీసుల రూపంలో అధికార వైసీపీ అడ్డుకుందనే వాదన ఉంది. కానీ పైకి మాత్రం పోలీసులే కనిపిస్తున్నారు. కేంద్రమంత్రి అయినా తమకు పర్మిషన్ కావాలని చెప్పారు. అనుమతి ఉంటేనే వాహనాలను అనుమతి ఇస్తామని చెప్పారు. దీంతో ఢిల్లీలో చెల్లిన బుగ్గ కారు.. ఏపీలో చెల్లలేదా అనే చర్చ వచ్చింది. కానీ దీనిపై బీజేపీ శ్రేణులు/ నేతలు స్పందించాల్సి ఉంది. అప్పుడే అధికార వైసీపీ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఏపీపై బీజేపీ ఫోకస్ చేసిందని దీనిని బట్టి స్పష్టమవుతోంది. ఇందులో ఏ మాత్రం సందేహాం లేదు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+