వినాశకాలే విపరీత బుద్ధి .. బీజేపీ వినాశనాన్ని వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారన్న యామిని
తెలుగుదేశం పార్టీ మహిళా అధికార ప్రతినిధి, ఫైర్ బ్రాండ్ సాధినేని యామిని బీజేపీపై మండిపడ్డారు. ఏపీలో బీజేపీ చేష్టలతో ప్రజల కడుపు మండిపోతోందని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని పేర్కొన్నారు . వినాశ కాలే విపరీత బుద్ధి అన్న చందంగా బీజేపీ నేతలు వినాశ కాలానికే ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు.
ఓ చర్చా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ఏపీలో బీజేపీ అగ్రనేతలు పర్యటించిన సమయంలో ప్రజలు నిరసన తెలపడం ద్వారా తగినబుద్ధి చెప్పారని అన్నారు. అయినా బీజేపీ నాయకులకు ఏ మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదని ఆమె ఆరోపించారు. 'వినాశకాలే విపరీత బుద్ధి' అన్నట్లు అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడే ఇలాంటి పనులు చేస్తారని, బీజేపీ వాళ్ల వినాశనాన్ని వాళ్లే కొనితెచ్చుకుంటున్నారని యామిని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ పరిపాలన లేని రాష్ట్రాల్లో తాము తలచుకుంటే ఆ ప్రభుత్వాలు ఉంటాయా? అంటూ ఆ పార్టీ నేత రఘురాం చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. బీజేపీ అణచివేత ధోరణి అవలంబిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ పార్టీల పట్ల బీజేపీ తీరు ఎలా ఉందో చెప్పడానికి ఆ పార్టీ నేత రఘు రాం చేసిన ఈ వ్యాఖ్యలే నిదర్శనమని అన్నారు. దేశంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, చివరకు సీఈసీపై ఉన్న నమ్మకాన్ని కూడా పోగొట్టేలా బీజేపీ చేసిందని దుయ్యబట్టారు సాధినేని యామిని.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు!












Click it and Unblock the Notifications