చిప్పకూడు తిన్నాడు చిట్టి రెడ్డి ... చరిత్ర మర్చిపోయావా సాయిరెడ్డి : బుద్దా వెంకన్న ఫైర్

టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, విజయసాయిరెడ్డిల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీని, చంద్రబాబును , లోకేష్ ను టార్గెట్ చెయ్యటం , ఆయన పెట్టిన పోస్టులకు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కౌంటర్ ఇవ్వటం షరా మామూలు అయిపోయింది.తాజాగా చిట్టి నాయుడు అంటూ లోకేష్ పై విజయసాయి చేసిన పోస్టుకు చిట్టి రెడ్డి అని జగన్ ను సంబోధిస్తూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు బుద్దా వెంకన్న .

మంగళగిరిలో ఓడిపోయావ్... బడాయి చాల్లే చిట్టి నాయుడు అన్న సాయి రెడ్డి

మంగళగిరిలో ఓడిపోయావ్... బడాయి చాల్లే చిట్టి నాయుడు అన్న సాయి రెడ్డి

ఇక ఆయన చేసిన పోస్టులో "చరిత్ర సృష్టించేందుకే మంగళగిరిలో పోటీ చేశాడట చిట్టి నాయుడు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేకనే కదా దొడ్డి దారిన ఎమ్మెల్సీ, మంత్రి అయింది. ఈ చరిత్ర సృష్టించాలన్న తాపత్రం ఏమిటో? రెండొందల కోట్లు వెదజల్లినా మంగళగిరిలో చిత్తుగా పరాజయం పాలయ్యావు. ఇకనైనా బడాయి మాటలు మానుకో చిట్టీ." అంటూ వ్యంగ్యంగా నారా లోకేష్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు .

అంబేద్కర్ ను అవమానిస్తున్నారని చంద్రబాబుపై విమర్శలు

అంబేద్కర్ ను అవమానిస్తున్నారని చంద్రబాబుపై విమర్శలు

అంతేకాదు అంతకుముందు చంద్రబాబును ఉద్దేశంచి కూడా విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. నీ ప్రచార పిచ్చికి అంబేద్కర్ మహాశయుడి పేరు కూడా వాడుకుంటున్నావు కదా చంద్రబాబు అంటూ మండిపడిన సాయిరెడ్డి , తెలుగుదేశం పార్టీ ఆయనకు భారతరత్న ఇప్పించిందా? బాబాసాహెబ్ కు అర్హత లేకున్నా మీరే ఇప్పించారన్నట్టు అవమానిస్తున్నారు కదా బాబూ? అంటూ పేర్కొన్నారు. ఆలస్యంగానైనా ఆయనను భారతరత్నతో గౌరవించిందీ దేశం. మధ్యలో మీరెవరు?అంటూ ప్రశ్నించారు.

తల్లిని గెలిపించుకోలేని అసమర్ధుడు చిట్టి రెడ్డి అన్న బుద్దా వెంకన్న

తల్లిని గెలిపించుకోలేని అసమర్ధుడు చిట్టి రెడ్డి అన్న బుద్దా వెంకన్న

ఇక ఈ పోస్ట్ కు సమాధానంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విజయసాయిరెడ్డిని ఉద్దేశించి ట్విట్టర్ వేదికగానే రివర్స్ కౌంటర్ ఇచ్చారు . జగన్ పై , విజయసాయిపై విమర్శలు గుప్పించారు. ‘‘తండ్రి గెలిచిన చోట గెలిచి కాలర్ ఎగరేస్తాడు చిట్టి రెడ్డి, కన్న తల్లిని గెలిపించుకోలేని అసమర్థుడు అయినా.. నాదే పైచేయి అంటాడు. దొంగ పనులు చేసి దొరికిపోయి చిప్పకూడు తిన్నా బడాయి మాటలు మాట్లాడతాడు చిట్టి రెడ్డి. చరిత్ర మర్చిపోయారా విజయసాయి రెడ్డి గారు''?అని చాలా ఘాటుగా సమాధానం ఇచ్చారు.

గెలుపు కోసం రూ. 200 కోట్లు ఖర్చు చేసినట్టు మీ మాటల్లోనే చెప్పారన్న వెంకన్న

గెలుపు కోసం రూ. 200 కోట్లు ఖర్చు చేసినట్టు మీ మాటల్లోనే చెప్పారన్న వెంకన్న

అంతే కాదు మంగళగిరి ఎన్నికల్లో నారా లోకేష్‌ని ఓడించడానికి వైఎస్ కుటుంబం మొత్తం రంగంలోకి దిగారని పేర్కొన్నారు. పెయిడ్ ఆర్టిసులు కూడా అక్కడే మకాం వేశారని బుద్దా వెంకన్న విరుచుకుపడ్డారు . ఈ విషయం కూడా మర్చిపోతే ఎలా అని అన్నారు. అన్నట్టు ఒక్క మంగళగిరిలో వైసీపీ గెలుపు కోసం మీరు రూ. 200 కోట్లు ఖర్చు చేసినట్టు మీ మాటల్లోనే బయట పెట్టినందుకు ధన్యవాదాలు అని బుద్దా వెంకన్న చురకలు అంటించారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+