విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ రాజధాని నివేదిక రెఢీ... సీఎం జగన్‌కు అందించిన జీఎన్ రావు కమిటీ

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్‌తో ముడిపడిన రాజధాని నివేదిక రాష్ట్రప్రభుత్వానికి అందింది. రాజధాని ఏర్పాటుపై జీఎన్ రావు కమిటీ మధ్యాహ్నం సీఎం జగన్‌తో సమావేశం అయ్యారు. అనంతరం సీఎం జగన్‌కు నిపుణుల కమిటీ నివేదిక అందించింది. కాగా ఉత్కంఠ రేపుతున్న అంశాలు బయటకు వచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వానికి చేరిన నివేదికలోని అంశాలపై క్యాబినెట్‌లో చర్చించిన అనంతరం బహిర్గతం చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా క్యాబినెట్ సమావేశాన్ని ఈనెల 26 లేదా 27 తేదిల్లో సమావేశం అయ్యో అవకాశాలున్నట్టు సమాచారం.

రాజధాని రైతులకు జనసేన అండ.... పవన్ కళ్యాణ్... అమరావతిలో పార్టీ బృందం పర్యటనరాజధాని రైతులకు జనసేన అండ.... పవన్ కళ్యాణ్... అమరావతిలో పార్టీ బృందం పర్యటన

రాష్ట్ర సమగ్ర అభివృద్దికి జీఎన్ రావు కమిటి

రాష్ట్ర సమగ్ర అభివృద్దికి జీఎన్ రావు కమిటి

రాజధాని సహా రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం సూచనలు ఇవ్వడం కోసం రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ జీఎన్ రావు అధ్యక్షతన తొమ్మిది మందితో కూడిన నిపుణుల కమిటీని జగన్ సర్కారు సెప్టెంబర్ 13న ఏర్పాటు చేస్తూ... జీవో విడుదల చేసింది. కమిటీ నివేదిక ఆరువారాల్లో ఇవ్వాలని జీవోలో సూచించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో కమిటీ సభ్యులు పర్యటించారు. ఈ నేపథ్యంలోనే నేడు రాజధానితో పాటు రాష్ట్ర అభివృద్దిపై సమగ్ర నివేదికను దాదాపు మూడు నెలల తర్వాత నివేదికను కమిటీ నేడు అందించింది.

 మూడు రాజధానులంటూ సీఎం జగన్ ప్రకటన

మూడు రాజధానులంటూ సీఎం జగన్ ప్రకటన

కాగా ఇప్పటికే రాజధానిపై సీఎమ్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేశారు. రాష్ట్రానికి 3 రాజధానులు ఉండొచ్చని, లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌గా అమరావతి, అడ్మినిస్ట్రేటివ్‌ రాజధానిగా విశాఖపట్నం, జ్యుడీషియల్‌ క్యాపిటల్‌గా కర్నూలు ఉండొచ్చని సీఎం జగన్‌ ఏకంగా అసెంబ్లీలో ప్రకటన చేశారు. దీంతో రాజధాని నిర్మాణంపై సీఎం కొంత స్పష్టత ఇచ్చారనే అభిప్రాయాలు వెలువడ్డాయి.. ఇక ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన ప్రకటపై కొంత వివాదం కూడ నెలకొంది.

నివేదిక రాకముందే సీఎం ప్రకటన చేయడం వివాదం...

నివేదిక రాకముందే సీఎం ప్రకటన చేయడం వివాదం...

సీఎం ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా కొంత వివాదం నెలకొంది. రాజధాని నిర్మాణంపై రిపోర్ట్ రాకముందే సీఎం ప్రకటన చేయడంతో కొంత విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే మూడు రాజధానులు రావోచ్చు అని మాత్రమే సీఎం ప్రకటన చేశారని ప్రభుత్వంలోని మంత్రులు వివరించే ప్రయత్నం చేశారు. పూర్తిగా నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టత వస్తుందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి కమిటి ఇచ్చిన రిపోర్టులో సీఎం జగన్ అభిప్రాయానికి అనుగుణంగా ఉంటుందా లేక ఇతర మార్పులు ఏమైనా ఉంటాయా అనే ఉత్కంఠ నెలకొంది.

 అఖిలపక్షం ఏర్పాటు

అఖిలపక్షం ఏర్పాటు


కాగా రాజధానిపై రాజధాని రైతులతో పాటు విపక్ష టీడీపీ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలోనే కమిటీ నివేదికపై చర్చించేందుకు ముందుగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. సమావేశంలో కమిటీ ఇచ్చిన అంశాలపై చర్చించి , నివేదిక అమలుపై నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా రాష్ట్ర రాధాధాని అంశం కావడంతో మెజారీటీ పార్టీల నిర్ణయంతో నివేదికను అమోదించుకుని వివాదాలు లేకుండా చూసుకునేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. కాగా అఖిలపక్షాన్ని నూతన సంవత్సరంలో ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.

English summary
The State Government has received a capital report from the GN Rao committee , the committe met cm jaganmohan reddy today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X