దుర్గ గుడి వెండి రథం మూడు సింహాల మాయం కేసు దర్యాప్తులో పురోగతి .. ఘటన ఎప్పుడు జరిగిందంటే
విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడిలో,అమ్మవారి వెండి రథంలో మూడు సింహాలు చోరీకి గురి కావటం, ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీల తీవ్ర వ్యాఖ్యలు, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చెయ్యటం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు . అసలీ వెండి సింహాలు ఎప్పుడు మాయం అయ్యాయి అన్న దానిపై దర్యాప్తు జరిపిన పోలీసులు ఈ ఏడాది జూన్ నెలలో వెండి సింహాలు మాయం అయినట్టు గుర్తించారు.

మూడు సింహాలు ఒకేసారి చోరీ కాలేదు .. జూన్ 26న రెండు సింహాలు మాయం
ఇటీవల విజయవాడ కనకదుర్గ అమ్మవారి వెండి రధానికి ఉండవలసిన నాలుగు వెండి సింహాలలో మూడు సింహాలు మాయం కావటం ఏపీలో పెద్ద దుమారం రేపింది . నాలుగు సింహాలలో మూడు మాయం కాగా ఒకటి మాత్రమే మిగిలి ఉండగా ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. తాజాగా ఈ కేసులో కీలక పురోగతి కనిపించింది. మూడు సింహాలు ఒకేసారి మాయం కాలేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఏడాది జూన్ 26వ తేదీన రెండు సింహాల విగ్రహాలు మాయమైనట్లుగా పోలీసులు గుర్తించారు.

జూన్ 29న మరో రెండు సింహాల చోరీ యత్నం .. కానీ ఒకటే చోరీ
ఆ తర్వాత జూన్ 29వ తేదీన మరో రెండు సింహాలు దొంగతనం చేయడానికి ప్రయత్నించినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ఆ సమయంలో ఒక సింహం చోరీ చెయ్యగా , మరొక దానిని తీసుకెళ్లలేకపోయారు. అయితే ఈ కేసులో త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు . అసలు ఈ కేసు పోలీసులకు సవాల్ విసిరింది . గత ఉగాది తర్వాత నుండి ఇప్పటి వరకు రథాన్ని వినియోగించకపోవటంతో ఘటన ఎప్పుడు జరిగిందో అన్న అనుమానం కలిగింది .

అడుగడుగునా కీలక సవాళ్ళతో పోలీసుల దర్యాప్తు .. ఎట్టకేలకు కేసు దర్యాప్తులో పురోగతి
వెండి సింహాలు మాయమైన ఘటనలో అడుగడుగునా పోలీసులు సవాల్ ఎదుర్కొన్నారు . వెండి సింహాలు చోరీ వార్త బయటకు రాగానే రథ ప్రదేశంలో ప్రతిపక్ష పార్టీలు హడావిడి చేశాయి. దీంతో వేలిముద్రల సేకరణ ఇబ్బందిగా మారింది. డాగ్ స్క్వాడ్ ద్వారా నిందితులను కనుగొనే ప్రయత్నం చేద్దామన్నా చాలామంది రాజకీయ పార్టీల నేతలు అక్కడికి వచ్చి వెళ్లడంతో అది సాధ్యం కాలేదు . ఆలయ అప్రైజల్ సమీ, ఏఈవో రమేష్ లను , ఆలయ సిబ్బందిని విచారణ జరిపిన పోలీసులు ఎట్టకేలకు ఈ కేసులో పురోగతి సాధించారు. ఎప్పుడు చోరీ జరిగిందో గుర్తించిన పోలీసులు ఎవరు చోరీ చేశారో కూడా గుర్తించినట్టే తెలుస్తుంది .
-
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ!












Click it and Unblock the Notifications