పొత్తుల రాజకీయం కొత్త మలుపు - స్టీల్ ప్లాంట్ పై కేంద్రం కీలక నిర్ణయం..!!

ఏపీలో పొత్తుల రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది. విశాఖలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమ పాలనా విజయాలను ఏకరువు పెట్టారు. ఇదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. స్టీల్ ప్లాంట్ క మద్దతుగా నిలవాలని కార్మికులు కోరుతున్న వేళ..విశాఖ ఉక్కు ఆస్తులు అమ్మకానికి రంగం సిద్దమైంది. ఈ మేరకు ప్రకటన జారీ అయింది. స్టీల్ ప్లాంట్ భూముల కోసమే ప్లాంట్ పీక నొక్కేస్తున్నారంటూ వైసీపీ ఆరోపించిన సమయంలోనే ఈ నిర్ణయం బయటకు వచ్చింది.

ప్లాంట్ ఆస్తుల అమ్మకం:బీజేపీతో పొత్తు కోసం టీడీపీ, జనసేన ప్రయత్నాలు సాగుతున్నాయి. ఏపీలో పర్యటించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. బీజేపీ అధ్యక్షుడు నడ్డా తొమ్మిదేళ్ల పాలనలో తాము ఏం సాధించామో గొప్పగా ప్రచారం చేసుకున్నారు. స్టీల్ ప్లాంట్ గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించ లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వంద శాతం పెట్టుబడులను ఉపసంహరించాలని నిర్ణయించిన కేంద్ర..మరో కీలక అడుగు వేసింది. ఆస్తుల అమ్మకానికి రంగం సిద్దం చేసింది.

Central Approval for sale of Vizag Steel properties in Vizag, issues notification leads to political controversy

విశఆఖలో హెచ్ బీ కాలనీలో 22.90 ఎకరాల్లో ఉన్న 588 క్వార్టర్లను అమ్మేందుకు అధికారులు నిర్ణయించారు. ఆటోనగరంలోని 2 ఎకరాల పరిధఇలో ఉన్న 76 ఇళ్లు, పెదగంట్యాడలో 434.75 చదరపు గజాల్లో ఉన్న 8 ఆర్ఐఎన్ఎల్ అమ్మకానికి పెట్టింది. ఈ మేరకు అధికారిక ప్రకటన జారీ అయింది.

కార్మికుల ఆందోళన:విశాఖ పరిధిలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఈ మేరకు ఆసక్తి తెలపాలని కోరుతూ లేఖలను విడుదల చేసారు. ఈ ఆస్తులను ఏకమొత్తంగా లేదా విడివిడిగా కొనుగోలు చేసుకొనే సదుపాయం కల్పించారు. ఆస్తుల కొనుగోలు విషయంలో ఆసక్తి తెలిపేందుకు పది రోజుల గడువు ప్రకటించారు.

నగరం నడిబొడ్డున ఉన్న హెచ్ బీ కాలనీలో అమ్మకానికి పెట్టిన 22.90 ఎకరాల స్థలం విలువ బహిరంగ మార్కెట్ లో దాదాపు రూ 1500 కోట్లు ఉంది. ఆటోనగర్ లోని రెండు ఎకరాల స్థలం రూ 100 కోట్ల వరకు ఉంది. ఈ నిర్ణయం పైన కార్మిక సంఘాలు మండి పడుతున్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంటుకు ముడిపదార్థాల కొనుగోళ్లు, నిర్వహణ మూలధనం కోసం తక్షణం రూ.5 వేల కోట్లు కావాలి. దీనికోసం ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన, ఆ తర్వాత టెండర్ల ప్రక్రియ నడుస్తోంది. ఈలోగా ఆస్తులు అమ్మాలనే ప్రయత్నం చేస్తున్నారు.

పొత్తులు..నిర్ణయాలు:ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్ ను నష్టాల నుంచి ఆదుకొనేందుకు చూపిన చొరవ విశాఖ ప్లాంట్ పై కేంద్రం చూపడం లేదు. సెయిల్‌ గతంలో ఇలాగే నష్టాల్లో ఉంటే ఆ సంస్థకు కేప్టివ్‌ మైన్స్‌గా ఇచ్చిన గనుల్లో ఐరన్‌ ఓర్‌ అమ్ముకోవడానికి అనుమతిచ్చారు. సాధారణంగా కేప్టివ్‌ మైన్స్‌ను ఉత్పత్తికి మాత్రమే వాడుకోవాలి... అమ్ముకోకూడదు. కానీ కేంద్రం ప్రత్యేక అనుమతిచ్చింది. దాంతో సెయిల్‌ నష్టాల నుంచి గట్టెక్కింది.

ఇప్పుడు విశాఖ స్టీల్‌కూ అలాగ ఆర్థిక సాయం చేయాలని ఉద్యోగ, కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. భూములను కేంద్రమే తీసుకొని, విశాఖ స్టీల్‌కు రూ.5 వేల కోట్ల సాయం చేయాలని కోరుతున్నాయి. కానీ, ఇప్పుడు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఎన్నికలు..పొత్తుల రాజకీయం వేళ ఇప్పుడు ఈ నిర్ణయం పైన అధికార ..ప్రతిపక్షాలు ఏ రకంగా స్పందిస్తాయో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+