కదులుతున్న రైలులో ప్రేమికులు.. ఒక్కసారిగా ....
అమరావతి/ విజయనగరం : ఆ రైలు కదులుతుంది. అందులో ఓ ప్రేమ జంట ఉంది. వారిద్దరూ కలిసి చేయిపట్టుకున్నారు. ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా రైలు నుంచి దూకేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతుంది. వారు ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశారనే అంశంపై క్లారిటీ రాలేదు. వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదా ? పెళ్లికి ఒప్పుకోలేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
విజయనగరం జిల్లా నెల్లిమర్లకు రైలు చేరుకుంది. నెల్లిమర్ల రైల్వేస్టేషన్ సమీపిస్తుండటంతో స్పీడ్ తగ్గింది. అయితే అదీ గమనించని ఓ జంట .. రైలు నుంచి దూకేశారు. రైలు స్పీడ్ తక్కువ ఉండటంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. వారి సూసైడ్ అటెంప్ట్‌ను చేసిన ట్రాక్ సిబ్బంది .. వెంటనే అక్కడికి చేరుకున్నారు. 108 వాహనం ద్వారా స్థానిక ఆస్పత్రికి తరలించారు.

వారిద్దరికీ తీవ్రగాయాలు కావడంతో విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రేమ జంటది బలిజిపేట మండలం అరసాడ, ఇరువాడకు చెందినవారని గుర్తించారు. వారు ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశారనే అంశంపై స్పష్టత రాలేదు. వారి ప్రేమను పెద్దలు అంగీకరించి ఉండరని అభిప్రాయం వ్యక్తమవుతుంది. కలిసి జీవించలేని తాము .. కలిసి చనిపోదామని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అందుకే ఒక్కటై .. ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు.












Click it and Unblock the Notifications